పె్‌ళ్ళిచూపులు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది – ద‌గ్గుబాటి రానా

rana
డి.సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి(ధ‌ర్మ ప‌థ క్రియేష‌న్స్‌), య‌ష్ రంగినేని(బిగ్ బెన్ సినిమాస్‌) నిర్మాతలుగా త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర కొండ‌, రీతూ వర్మ జంటగా రూపొందిన చిత్రం `పెళ్ళిచూపులు`. ఈ చిత్రం జూలై 29న విడుద‌లై సూపర్‌హిట్ట‌య్యింది. ఇటు ప్రేక్ష‌కులు, అటు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల నుండి సినిమా మంచి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా స్పెష‌ల్ షోను హీరో ద‌గ్గుబాటి రానా వీక్షించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
రానా మాట్లాడుతూ “పెళ్ళిచూపులు సినిమా చాలా బావుంది. విజ‌య్ దేవ‌ర కొండ‌, రీతూవ‌ర్మ స‌హా అంద‌రూ చ‌క్క‌గా యాక్ట్ చేశారు. ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ సినిమా బ్యూటీఫుల్‌గా తెర‌కెక్కించారు. వివేక్ సాగ‌ర్ మ్యూజిక్‌, నాగేష్ సినిమాటోగ్ర‌ఫీ ఎక్స‌లెంట్‌గా ఉన్నాయి. మంచి టీం వ‌ర్క్ చేసింది. ఈ చిత్రం మా బ్యాన‌ర్‌లో విడుద‌ల కావడం హ్యాపీగా ఉంది. హీరో క్యారెక్ట‌ర్ రియ‌ల్ లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. నేను కూడా ప‌ద‌వ త‌ర‌గ‌తి త‌ప్పాను. డిగ్రీ వ‌ర‌కు మాత్ర‌మే చ‌దివాను. ఇలా కొన్ని పాయింట్స్ క‌నెక్ట్ అయ్యాయి. సినిమా ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. టీం అంద‌రికీ కంగ్రాట్స్‌“ అన్నారు.
To Top

Send this to a friend