పారితోషికం డబుల్


గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాతో హీరో బాలక్రిష్ణ సైతం 50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. దీంతో ఆయన తరువాతి 101 సినిమాకు భారీ పారితోషికాన్ని నిర్మాతలు ఇస్తున్నట్టు ఫిలింనగర్ టాక్.. ప్రస్తుతం బాలయ్య డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా ఒప్పుకున్నాడు. ఒకరు మాస్.. మరొకరు క్లాస్ కావడంతో సినిమా ఎలా ఉంటుందనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తికర కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు నిర్మాతలు 35 కోట్లు పెట్టుబడిగా వెచ్చించనున్నట్లు తెలిసింది.

గౌతమిపుత్ర శాతకర్ణికి ముందు బాలయ్య రెమ్యూనరేషన్ రూ.5 నుంచి 7కోట్ల వరకు ఉండేది.కానీ గౌతమీ పుత్ర ఘనవిజయం సాధించిన తరువాత ఆయన సినిమా వసూళ్లు రూ.50కోట్ల క్లబ్ లో చేరాయి. దీంతో తన రెమ్యూనరేషన్ ను బాలయ్య పెంచినట్టు సమాచారం. నిర్మాతలు కూడా దీనికి ఓకే అన్నట్టు తెలిసింది. పూరిజగన్నాత్ సినిమాకోసం మొత్తం 35 బడ్జెట్ ను పెడుతుండగా ఇందులో బాలయ్యకే 10కోట్లు పోనున్నాయి. అందరూ కొత్తవారే కావడంతో మిగతా ఖర్చులు కలిసిరానున్నాయి. 25 కోట్ల బడ్జెట్ ను సినిమా కోసం వెచ్చించనున్నారు. ఇందులో నటీనటులు, దర్శకుడి ఖర్చు కూడా ఉంటుంది..

కాగా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు తీసే దర్శకుడిగా పూరికి పేరుంది. అయిదు నెలల్లోనే బాలయ్య సినిమాను తెరకెక్కిస్తాని పూరి ప్రకటించారు. అంతా అనుకున్నట్టు జరిగితే బడ్జెట్ కూడా తగ్గిపోతుంది.

బాలయ్య సినిమాతో తమకు లాభాలేనని నిర్మాతలు భావిస్తున్నారు. సినిమా థియేట్రికల్ రైట్స్ ఎలాగైనా రూ.40 కోట్ల ఫ్రాఫిట్ వస్తుంది. ఇంకా ఆడియో , వీడియో, శాటిలైట్ రైట్స్ రూపేణ రూ.12 కోట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎంతలేదన్నా 52 కోట్ల మొత్తం వస్తే ఖర్చు ఓ 20 కోట్లు, దర్శకుడి రెమ్యూనరేషన్ పోనూ ఎంత లేదన్న 20 కోట్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. దీంతో బాలయ్య సినిమాకు 35 కోట్లు పెట్టడంలో తప్పులేదని నిర్మాతలు భావిస్తున్నారు..

To Top

Send this to a friend