పవన్ రేపిన గాయాలపై.. వెంకయ్య యాంటిమెంటు..

పాత గాయాలు మళ్లీ రేపద్దు.. నీతో సమరం లేదు మిత్రమా సంధియే.. పవన్ విమర్శలపై సుతిమెత్తగా.. గాయాలపై యాంటిమెంటు పూసి కట్టుకట్టిన చందంగా వెంకయ్య సమాధానమిచ్చారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలుగు మీడియాతో మాట్లాడారు. పవన్ లేవనెత్తిన ప్రశ్నలు, బీజేపీ చేస్తున్న పనులు.. చంద్రబాబు సహకారం, ఏపీ ప్రభుత్వం ఊదరగొట్టారు.

హోదా ఇవ్వలేమని అర్థరాత్రి ప్రకటించారన్న పవన్ విమర్శలకు వెంకయ్య కౌంటర్ ఇచ్చారు. ప్రజలు నిద్రపోయినా పరిపాలన 24 గంటలు కొనసాగుతుందని అందుకే కేంద్ర నిర్ణయాలకు టైం అంటూ ఉండదన్నారు. చంద్రబాబు బీజేపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని.. ఎక్కడ ఎన్ని వేల ఎకరాలంటే అన్ని సేకరించి తమ చేతిలో పెడుతున్నాడని వెంకయ్య చెప్పుకొచ్చారు. నిజమే.. బాబూ రైతుల్ని కొట్టి భూ పందేరం చేస్తున్న తీరును పవన్ ఎండగట్టినట్టే వెంకయ్య తన ప్రసంగంలో పరోక్షంగా ఒప్పుకున్నారు.. అమరావతి కోసం చంద్రబాబు ల్యాండ్ పుల్లింగ్ అనే కొత్త సూత్రాన్ని తెచ్చారని.. అభివృద్ది చేస్తున్నారని బాబును ప్రసంశించారు. ప్యాకేజీ ఇస్తే ఏపీకి నష్టమని.. అంతకంటే వివిధ పథకాలు, అభివృద్ది పనులతో ఏపీకి వేలకోట్లు తెచ్చిపెడుతున్నామని వెంకయ్య జబ్బలు చరుచుకున్నారు. అంతా అభివృద్ది చుట్టూ సాగిన వెంకయ్య ప్రసంగంలో ఎక్కడా పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించలేదు..మసిపూసి మరేడు కాయ చేసిన వెంకయ్య ఏపీ ప్రజల గాయాలపై యాంటిమెంటు పూసిన చందంగా ప్రసంగం కొనసాగింది.

To Top

Send this to a friend