‘పటాస్‌’ పనైపోయినట్లేనా?

ఈటీవీ ప్లస్‌ ప్రారంభం అయినప్పటి నుండి కూడా ప్రసారం అవుతున్న పటాస్‌ కార్యక్రమం త్వరలోనే నిలిచి పోనున్నట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా పటాస్‌ మరియు జబర్దస్త్‌ కార్యక్రమాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు షోలు కామెడీ పేరుతో బూతుగా మారిపోయాయి అంటూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ సమయంలోనే చలపతి రావు ఇష్యూలో రవి సూపర్‌ అంటూ వ్యాఖ్యనించడం మరింత విమర్శలకు తెర లేపడం జరిగింది. పటాస్‌ నుండి రవిని తొలగిస్తున్నట్లుగా మొదట ప్రకటన వచ్చింది. తాజాగా శ్రీముఖి బూతులు కూడా పటాస్‌లో హద్దు మీరుతున్నాయి. దాంతో ఆమెను కూడా తొలగించాలనే నిర్ణయానికి మల్లెమాల ప్రొడక్షన్స్‌ వారు నిర్ణయించారు.

వీరిద్దరు కాకుండా పటాస్‌ను మరే యాంకర్స్‌తో నడిపించేందుకు మల్లెమాల వారు ఆసక్తిగా లేరు. దాంతో మల్లెమాల ప్రొడక్షన్స్‌ పటాస్‌ స్థానంలో కొత్త షోను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మల్లెమాల ప్రొడక్షన్స్‌కు సంబంధించిన ‘పటాస్‌’, ‘జబర్దస్త్‌’ కార్యక్రమాలపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రెండులో ఒక్కటైనా నిలిపేస్తే కాస్త విమర్శలు తగ్గుతాయని కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

పటాస్‌ షోలో రవి, శ్రీముఖిలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వీరిద్దరు కాస్త శృతిమించి మరీ మాట్లాడటం, ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూ బూతు కామెడీ చేస్తున్నారు. ఈ షోతోనే వీరిద్దరికి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. వీరిద్దరికి పటాస్‌ షో నిలిచి పోవడం పెద్ద షాక్‌గా చెప్పుకోవచ్చు. జబర్దస్త్‌కు వచ్చినంత ప్రజాధరణ పటాస్‌ షోకు రాని కారణంగా కూడా దానిని నిలిపేయబోతున్నట్లుగా చెప్పుకుంటున్నారు.

To Top

Send this to a friend