నోట్ల రద్దు.. మోడీ మాట్లాడితే ఒట్టు.

సర్వేలు వచ్చాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడతారో..? తెలసిపోతోంది.. జాతీయ చానాళ్ల సర్వేల్లో స్పష్టమవుతోంది.. ఎక్కడ చూసినా బీజేపీకి ఎదురుగాలేనట.. అయినా మోడీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో పాగా వేయాలని మోడీ వేస్తున్న ప్లాన్లకు కాంగ్రెస్-ఎస్పీ గట్టి షాక్ ఇచ్చాయి. మిగతా పంజాబ్, ఉత్తరఖండ్, గోవా, మణిపూర్ లలో కూడా బీజేపీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయి.. దీనికి మోడీ స్వయంకృతాపరాధమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు..
పెద్ద నోట్ల రద్దు.. ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా బీజేపీని ముంచబోతోంది అదేమోనని బావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల 10శాతం ఉన్న కుబేరులు ఎవ్వరూ ఇబ్బందులు పడలేదు.. దాదాపు 90శాతం మంది ఉన్న సామాన్యులు, మధ్యతరగతి వారే బాగా ఇబ్బందిపడ్డారు. అందుకే మోడీ సంధించిన ఈ అస్త్రం దేశ ఆర్థికవ్యవస్థనే కుదేలు చేసింది.. అభివృద్ధి మందగించింది.. రామబాణం కాస్త బీజేపీకే తగిలి ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది..
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడ సానుకూల వాతావరణం కనిపించడం లేదు. పెద్ద నోట్ల రద్దుపై దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టేందుకు రెడీ అవుతున్నారట.. సర్వేల్లో ఇదే స్పష్టంగా తెలుస్తోంది.. పంజాబ్ లో అధికార అకాళీదల్-బీజేపీ మూడోస్థానంలోకి పోతోందట.. ఇక ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్-ఎస్పీ కలవడంతో వారికే అధికారం దక్కుతుందని తేలింది.. ఇక గోవాలో బీజేపీ ఓటమి దిశగా పోతోందట.. మణిపూర్ కాంగ్రెస్ దేనట.. ఇలా సర్వేలు స్పష్టం చేయడంతో బీజేపీ-మోడీ లో మునుపటి ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అందుకే ప్రచారంలో మోడీ సహా ఎవ్వరూ నోట్ల రద్దు అంశాన్ని తమ విజయంగా.. కనీసం ప్రచారాస్త్రంగా కూడా వాడుకోవడం లేదు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో గెలిస్తే రామమందిరం.. పలు అభివృద్ధి పనులు చేస్తామని మాత్రమే హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అన్ని చోట్ల అంతే.. నోట్ల రద్దు, బడ్జెట్ లో కూడా ఎటువంటి ఉద్దీపనలు, సామాన్యులకు వరాలు కురిపించకపోవడంతో మోడీ మేనియా మసకబారింది.. 50 రోజులు ఓపికపడితే దేశాన్ని మార్చేస్తానన్న మాటలు నీటి బుడగల వలే తేలిపోయాయి. అందుకే ఓటమి కళ్లముందు మెదులుతున్న వేళ.. బీజేపీలో స్తబ్ధత నెలకొంది.

To Top

Send this to a friend