‘నేను లోకల్ ’ మూవీ రివ్యూ..

సినిమా పేరు: నేను లోకల్

నిర్మాణం : శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్

నటీనటులు: నాని , కీర్తిసురేష్, నవీన్ చంద్ర తదితరులు

కథ, స్ర్ర్కీన్ ప్లే, మాటలు : ప్రసన్నకుమార్ బెజవాడ

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

నిర్మాత : శిరీష్

దర్శకత్వం: నక్కిన త్రినాథరావు

నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని అభిమానుల్లో , చిత్ర సీమలో ఓ నమ్మకం ఉంది.. నాని ఎప్పుడు మంచి కథలనే ఎంచుకుంటాడని అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అందుకే ఈ సినిమా హీరో నాని సినిమాను చూసేందుకు జనం ఆసక్తి చూపుతారు.. ఈ మధ్య నానికి వరుస హిట్స్ పలకరిస్తున్నాయి. మజ్ను, జెంటిల్ మన్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, భలే భలే మగాడివోయ్ లాంటి వరు స హిట్స్ తో నాని మాంచి జోష్ మీదున్నాడు. ఈ సారి బీటెక్ స్టూడెంట్ గా నటించిన నేను లోకల్ మూవీలో స్టూడెంట్ గా ఈ నేచురల్ స్టార్ అదిరిపోయేలా నటించాడు. నిర్మాతగా ఇటీవల ఫాంలోకి వచ్చిన దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా పై అభిమానుల్లో అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను నాని అందుకున్నారా..? సెకండ్ హ్యాట్రిక్ సాధించాడా అన్నది కథలోకి వెళ్తే తెలుస్తుంది..

కథ:

బీటెక్ స్టూడెంట్ బాబు(నాని) గా నాని నటించాడు. కాపీ కొట్టి ఇంజనీరింగ్ పాస్ అవుతాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ కీర్తి సురేష్ తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తన ప్రేమను ఆమెకు చెబితే లైట్ తీసుకుంటుంది. కీర్తి తండ్రి లెక్చరర్.. తనకు డీసెంట్ గా ఉండే అబ్బాయిలంటే బాగా ఇష్టం. కీర్తి నాన్నకు హీరో నాని ప్రవర్తన నచ్చదు. కీర్తిని నానికి ఇచ్చి చేసేందుకు ఒప్పుకోడు.. ఈలోగానే నాని.. కీర్తిని ప్రేమలో పడేస్తాడు. కానీ కిర్తి తండ్రి సిద్ధార్త్ తో (నవీన్ చంద్ర) తో సంబంధం కలుపుకుంటాడు.. మరి కీర్తి తండ్రి మాటకు గౌరవించి సిద్దార్త్ ను పెళ్లి చేసుకుంటుందా..? లేక నానినే చేసుకుంటుందా అనేది సినిమాలో చూడాల్సిందే..

విశ్లేషణ:

నాని అంటేనే నేచురల్ స్టార్.. సహజసిద్దమైన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాడు.. నాని నటన ఇందులో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లోకల్ కుర్రాడిగా.. కాలేజి కుర్రాడిగా నాని నటన హైలెట్.. నాని డ్యాన్సులు, ఫైట్స్ కూడా ఆకట్టుకుంటాయి. కీర్తి సురేష్ లుక్స్ అదుర్స్.. తండ్రి పాత్రలో ప్రవీన్ కేడ్ కర్ సూపర్ గా నటించారు. సినిమా మొత్తాన్ని నాని దృష్టిలో ఉంచుకునే రచయిత అల్లాడని అనిపిస్తుంది.. ఫస్టాఫ్ లో కామెడీ, లవర్, ఆడియన్స్ ను అలరిస్తుంది.. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ సినిమాపై హైప్ తీసుకొచ్చింది. సెకండాఫ్ లో ఎమోషనల్ డ్రామా.. ఆసక్తికర మలుపులు చిత్రానికి కొంచె సాగదీసినా.. కామెడీ టైమింగ్ తో నాని నడిపించేశాడు. కొన్ని సీన్లు సాగదీశారు. ప్రీక్లైమాక్స్, ఎపిసోడ్స్ సినిమా ఇంట్రెస్ట్ రేపాయి. మొత్తంగా కీర్తి సురేష్ ప్రేమ కోసం నాని పడ్డ తపన చివరకు కార్పొరేటర్ గా అవడం.. మరో హీరో నవీన్ చంద్రతో కీర్తి కోసం పోరాటం నవ్వులు పూయించింది.. నేను లోకల్ సినిమా కథ మామూలు రోటీన్ అయినా.. ఎమోషనల్, హార్ట్ టచింగ్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచి రక్తి కట్టించాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమా బాగా ప్లస్ అయ్యింది.. కెమెరా, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బావున్నాయి.. రెండు గంటల ఇరవై మూడు నిమిషాల

ఈ సినిమా చూస్తె మంచి సీనిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం మీద యూత్ కు నచ్చే సినిమా ఇది..

ఏపీ న్యూస్ ఆన్ లైన్.ఇన్ రేటింగ్ : 3.25/5

To Top

Send this to a friend