నువ్విలా స్వేచ్ఛగా మాట్లాతున్నావంటే అది గాంధీ దయే ఓవైసీ..

అదో చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవి.. అందులో వ్యవసాయం చేసి కడుపు నింపుకోవాలి.. అందుకోసం ఓ మహాత్ముడు రేయినక, పగలనక కష్టపడి మొత్తం తొలగించి భూమిని సిద్ధం చేశాడు.. కానీ చివరకు సొమ్మసిల్లి చనిపోయాడు.. ఆ తరువాత వచ్చిన వారు అందులో నచ్చిన విత్తనాలు చల్లి పంట పండించారు. ఇందులో ఎవరిది గొప్ప.. కష్టపడి సాగుకు సిద్ధం చేసిన మహాత్ముడిదా.. లేక అంతా సిద్ధం అయ్యాక వచ్చి పంట పండించిన వారిదా.. ఖచ్చితంగా మొదటి వారిదే ఆ క్రెడిట్.. బ్రిటీష్ పాలనలో బానిస బతుకు బతుకుతున్న భారతీయులను విముక్తి చేయించి స్వేచ్ఛా వాయువులు పీల్చేలా చేసిన మహాత్ముడు గాంధీజీ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అసమానతలు తొలిగించడానికి రాజ్యాంగం రచించి అందరికీ సమాన అవకాశాలు కల్పించింది.. రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్.. వీరిద్దరు దేశ ఆణిముత్యాలు.. ఎవ్వరినీ కించపరచడానికి లేదు.. కానీ ఎంఐఎం నేత అసదుద్దీన్ లో మాత్రం ఆ ధోరణి కనపడుతోంది.

ఓవైసీ కి గాంధీ కంటే అంబేద్కరే మహాత్ముడిగా కనిపిస్తున్నాడట.. ఎందుకంటే దేశంలో లౌకిక, వర్గ రహిత సమాజాన్ని సృష్టించారని.. అణగారిన ముస్లిం, దళితులకు రిజర్వేషన్లు ఇప్పించిన ఘనత అంబేద్కర్ ది అని ఆయన సెలవిచ్చారు. అది కరెక్టే.. అసలు మనకు స్వాతంత్రమే రాకపోతే ఈ రిజర్వేషన్లు, వర్గరహిత, లౌకిక రాజ్యం సాధ్యమా.. మరి స్వాతంత్ర్యం సిద్దించిన గాంధీని విమర్శించి ఆ తరువాత దేశం కోసం పాటుపడ్డ అంబేద్కర్ ను ఎక్కువ చేసి చూపడం న్యాయమా అని గాంధేయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు దేశం గర్వించదగ్గ నేతలు.. ఎవరి ఘనత వారిదే..కానీ ఇలా ఒకరిని ఒకరితో పోల్చి అవమానించడం భావ్యం కాదని ఓవైసీ సూచిస్తున్నారు.. మహాత్ముడిని విమర్శించే అర్హత ఓవైసీ కి లేదని మండిపడుతున్నారు..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీచేస్తున్నారు.. వారికి మద్తతుగా ప్రచారం చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గాంధీని తక్కువ చేసి, అంబేద్కర్ ను ఎక్కువ చేసి మాట్లాడడం వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ సహా గాంధేయవాదులు ఓవైసీ మాటలను ఖండించారు. ఇలా దేశంలో ఓవైసీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారంటే అది గాంధీజీ ఇచ్చి స్వాతంత్ర్య ఫలాలేనన్న సంగతి మరిచిపోవద్దని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అయిన పశ్చాత్తాప పడని ఓవైసీ అదే రీతిలో మాట్లాడుతుండడం గమనార్హం.

To Top

Send this to a friend