నితిన్, నాని అతిధులుగా నిత్య మీన‌న్ సినిమా ఆడియో

IMG_6302

ఈనెల 13న విడుద‌ల కానున్న 100డేస్ ఆఫ్ ల‌వ్ ఆడియో ఫంక్ష‌న్ కు నితిన్, నాని ముఖ్య అతిధులుగా రానున్నారు. నాని తో అలా మొద‌లైంది, నితిన్ తో ఇష్క్, గుండెజారి గ‌ల్లంతయ్యిందే  సినిమాల‌తో నిత్య తో జోడీ క‌ట్టిన‌ వీళ్లు ఇప్పుడు నిత్యమీన‌న్ సినిమా ఆడియోను ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుద‌ల చేయ‌నున్నారు.

ఇప్ప‌టికే దుల్క‌ర్ స‌ల్మాన్, నిత్య మీన‌న్ లు క‌లిసి న‌టించిన సినిమాల‌న్నీ ఎంతో మంచి స‌క్సెస్ ను ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న 100 డేస్ ఆఫ్ ల‌వ్ సినిమా వీటన్నింటినీ మ‌రిపించేది గా తెర‌కెక్కించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు . జీన‌స్ ముహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో, SSC మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో , ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రం మ‌ల‌యాళం లో ఎంతటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను హైద‌రాబాద్ లో ఈనెల 13న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఓకే బంగారంతో యూత్ ని క‌ట్టిప‌డేసిన ఈ జంట‌, ఈ సినిమాతో అంద‌రికీ మరింత చేరువ కానున్నారు. మంచి రొమాంటిక్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జులై నెలాఖ‌రుకి విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.
To Top

Send this to a friend