నాగార్జునది పెద్ద మనసు.. కేటీఆర్ సవాల్ కు స్పందించాడు..

nag

చేనేతన్నల గాథలు చదివితే కన్నీళ్లను తెప్పిస్తాయి.. ఆత్మహత్యలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. అలాంటి చేనేతలకు చేయూతనందించేందకు కేటీఆర్ నడుం బిగించారు. ప్రభుత్వంలో ఉన్న తన పరపతిని ఉపయోగించి సర్వశిక్ష అభియాన్ లో రూ. 48 కోట్ల యూనిఫారాల కాంట్రాక్టును సిరిసిల్ల చేనేతన్నలకు అప్పగించారు. ఈ భారీ కాంట్రాక్టును సిరిసిల్ లనేతన్నలు అందరూ పంచుకున్నారు. 51 సొసైటీలు.. 6 వేలమంది కార్మికులకు ప్రస్తుతం చేతినిండా పని దొరికింది. ఆత్మహత్యల పరంపరకు ప్రస్తుతానికి చెక్ పడింది. కానీ ఇలా ఎంత కాలం.. ఎన్ని కాంట్రాక్టులు సంపాదిస్తే వారి జీవితాంతం వెలుగులు దక్కుతాయి.. కనీసం రోజంతా కష్టపడినా 100 రూపాయలకు సంపాదించని చేనేతలు ఇప్పుడు కేటీఆర్ కాంట్రాక్టు ఇవ్వడంతో మూడు పూటలా తినే డబ్బును సంపాదించుకుంటున్నారు..

చేనేతకు చూయూతనివ్వాలని మంత్రి ట్విట్టర్, ఫేస్ బుక్ లో క్రీడాకారులు, సినీ హీరోలకు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది.. హీరో నాగార్జున కేటీఆర్ చేనేతల హ్యాండ్లూమ్ సవాలుకు స్పందించారు. నాగార్జున, ఆయన సతీమణి అమలు చేనేత వస్త్రాలు ధరించి కేటీఆర్ సవాలును స్వీకరించారు. తాము చేనేతల బతుకు భరోసా ఇస్తామని.. ట్వీట్ చేసి కేటీఆర్ కు అటాచ్ చేసి ఇలా మరింత మంది హీరోలు ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ చర్య మరింత మంది స్ఫూర్తి రగలాలని.. మరింత మంది హీరోలు, నాయకులు, అధికారులు చేనేత దుస్తులు కొనుగోలు చేయాలని కేటీఆర్ పిలుపునిస్తున్నారు.. ఈ యజ్ఞం సాగాలని ఆశిద్దాం..

To Top

Send this to a friend