నయీం మలుపులు ఇన్నిన్ని కావయా!

 

కేసీఆర్ , తెలంగాణ పోలీసులకు మళ్లీ ఏమైందో ఏమో కానీ మళ్లీ మలుపులు.. నయీం కేసులో ఓ భారీ చేపకు వల వేసినట్టే కనపడుతోంది.. గ్యాంగ్ స్టర్ నరహంతకుడు నయీం కేసులో ఎంతోమంది ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వారందరినీ కాపాడే ప్రయత్నంలో సాక్ష్యాలు లేవని.. హైకోర్టులో బిగ్ షాట్ లను రక్షించింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు నయీం కేసుపై వేసిన సిట్ తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ను ప్రశ్నించడంతో కీలక మలుపు తిరిగింది.

నయీంతో అంటకాగాడని.. తనను బెదిరించాడని నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారి నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.2 కోట్లు చెల్లించాలని నయీం నన్ను బెదిరించాడని.. సాయం కోరితే నేతి విద్యాసాగర్ కూడా నయిం చెప్పినట్లే వినాలంటూ తనను బెదిరించాడంటూ ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు.

వ్యాపారి నాగేంద్ర భువనగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం.. దాన్ని సిట్ కు పంపించడం.. సిట్ నేతి విద్యాసాగర్ ను ప్రశ్నించడం జరిగిపోయింది. సిట్ ప్రశ్నలకు విద్యాసాగర్ బిత్తరపోయారట… తనకు నయీంతో సంబంధాలు లేవని తెలిపినట్టు తెలిసింది.. నల్గొండ, భువనగిరి ప్రాంతాల్లో వివాదాస్పద భూములను నయీం, విద్యాసాగర్ రావు సమీప బంధువులు కలిసి కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాలను సేకరించినట్టు తెలుస్తోంది.. అందులో భాగంగానే చార్జిషీట్ లో విద్యాసాగర్ పేరు చేర్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

To Top

Send this to a friend