ధోనీ మరిచిపోయాడు.. కోహ్లీ వెనకేసుకొచ్చాడు!

ఇన్నాళ్లు భారత జట్టును లీడ్ చేసిన మహేంద్రసింగ్ ధోనీ నిన్న కోహ్లీ కెప్టెన్ గా తొలి మ్యాచ్ లో చిన్న పొరపాటు చేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ఔట్ విషయంలో తాను కెప్టెన్ కాదనే సంగతిని మరిచిపోయి ఎంపైర్ ను రివ్యూ కోరాడు. దీనిపై విలేకరులు ప్రశ్నిస్తే మహీ నవ్వి ఊరుకున్నాడు.. ఇంకా నేనే కెప్టెన్ నని అనుకోవడం లేదు.. కానీ మునపటి రోజులు అలా తెలియకుండానే బయటకొచ్చేస్తున్నాయ్.. మైదానంలో ఇలాంటివి మామూలేనని’ నవ్వేశారు..

ఇక కోహ్లీ కూడా ఈ విషయంలో స్పందించాడు. ‘‘ మాకు అందరికీ పెద్దన్న ధోనినే ఆయన జట్టులో ఉన్నంతకాలం ఆయన సలహాల్ని వినియోగించుకుంటాం.. మా వరకు మాకు కెప్టెన్ ధోనినే’’ అని కోహ్లీ సహా క్రికెటర్లందరూ స్పష్టం చేశారు. దీంతో పెద్ద పొరపాటు కాస్త తేలిగ్గా మారిపోయింది.

భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన తొలి వన్డేలో భారత్ మూడు వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. 351 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 350 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 351 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ విరాట్ కోహ్లీ, కేదార్ జాదవ్ లు సెంచరీలతో కదం తొక్కడంతో సునాయాసంగా విజయం సాధిస్తుందనిపించింది. అయితే స్వల్వ వ్యవధిలోనే ఇరువురూ ఔట్ కావడంతో మ్యాచ్ లో ఉత్కంఠ పెరిగింది. అయితే పాండ్యా ధాటిగా ఆడటంతో భారత్ విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యత సాధించింది.

To Top

Send this to a friend