ధోని రుణం తీర్చుకున్న కోహ్లీ

కెప్టెన్ గా ఉన్నప్పుడు తనకు ఎన్నో సార్లు అవకాశమిచ్చి .. ప్రోత్సహించి ప్రస్తుతం కెప్టెన్ కావడానికి కారణమైన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ దోని రుణం తీర్చుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అవును.. విరాట్ కోహ్లీ క్రికెట్ లోకి అరంగేట్రం చేసినప్పుడు పలు సార్లు విఫలమయ్యాడు. ఆ సమయంలో ధోని తనకు అండగా నిలిచాడని కోహ్లీ చాలా సార్లు చెప్పాడు. ఇప్పుడు కెప్టెన్ గా ఎన్నికైన కోహ్లీ సందర్భం వచ్చినప్పుడల్లా ధోని చేసిన సేవలను స్మరిస్తున్నాడు. మ్యాచ్ అనంతరం ప్రెజంటేషన్ సెర్మనీలో కూడా ధోని ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడు అని వ్యాఖ్యాత అడినప్పుడు.. కోహ్లీ చాలా పాజిటివ్ గా స్పందించాడు..‘ధోని లాంటి అద్భుత ఆటగాడు.. క్రికెట్ గురించి మొత్తం తెలిసిన ప్రావీణ్యుడు జట్టులో ఉండడం నా అదృష్టం.. ధోని ఫీల్డింగ్ సెట్ చేయబట్టే నా పై ఒత్తిడి తగ్గింది. జట్టు విజయంలో ధోని ప్లాన్లు మరువలేనివి.. నాకు సలహాలిచ్చాడు..’ అని ధోని ఆకాశానికెత్తాడు కోహ్లీ..

ధోనిపై ఇంత అభిమానం ఉన్న కోహ్లీ.. మూడో ట్వీంటీకి ముందు అతడికి అద్భుత కానుక ఇచ్చి సత్కరించారు. నాలుగు వెండి స్టార్లు అతికించిన ఓ చెక్క ఫలకాన్ని అతడికి కోహ్లీ జట్టు సమక్షంలో బహుమతిగా ఇచ్చి సత్కరించారు. ఆ నాలుగు స్టార్లు ధోని సాధించిన నాలుగు… వరల్డ్ కప్ లు, చాంఫియన్స్ ట్రోపీ, వరల్డ్ నం1 ర్యాంకు అని అందులో రాశారట.. ఇలా తనకు లైఫ్ ఇచ్చిన ధోనిని టీం సమక్షంలో సన్మానించి కోహ్లీ ఘనంగా సన్మానించి రుణం తీర్చుకున్నాడు..

To Top

Send this to a friend