ధర్మసందేహం: బాహుబలి వ్యూస్ అన్ని కోట్లా.?

ఇంటర్నెట్ వాడకంలో చైనా 69 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండియా 34 కోట్ల మందితో రెండో స్థానంలో ఉంది. భారత దేశ మొత్తం జనాభాలో 26శాతం మందికి ఇంటర్నెట్ ఉంది. అది ఫోన్ల ద్వారా కావచ్చు.. ఇతర బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల ద్వారా కావచ్చు.. 4జీ మేనియా మొదలయ్యాక చాలా మంది వినియోగదారులు పెరుగుతున్నారు.. కాగా ఈ 34 కోట్ల మందిలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మాట్లాడేవారు కనీసం 30 నుంచి 40శాతం మంది ఉంటారనుకుందాం.. అంటే దాదాపు 10 కోట్ల మంది.. వీరందరూ ఏకకాలంలో అందరూ బాహుబలి ట్రైలర్ ను చూసి ఉంటారా.? అంటే నమ్మశక్యంగా లేదు.. కానీ బాహుబలి అండ్ టీం మాత్రం యూట్యూబ్, ఫేస్ బుక్ లలో లేదు చూశారు అని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో దేవుడికే తెలియాలి.. ఒక్కసారి విశ్లేషణ చూస్తే..

లెక్కలు, గణాంకాల ప్రకారం చూస్తే.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలలో బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దేశంలోనే అత్యధిక మంది చూసిన ట్రైలర్ గా బాహుబలి గుర్తింపు పొందిందని బాహుబలి టీం పేర్కొంది. ఇప్పటికీ కనీసం 8 కోట్ల మంది చూశారని చెప్పింది. ఈ లెక్కన ఈ 4 భాషల్లో మొత్తం ఇంటర్నెట్ యూజర్లే 10 కోట్ల మంది ఉంటే.. అందరూ చూశారంటే అది నమ్మశక్యంగా లేదు. ఇందులో వృద్ధులు, బిజినెస్ మ్యాన్స్, మహిళలు చాలా మంది ఉంటారు.. వారంతా బాహుబలి చూస్తారన్న నమ్మకంలేదు.. కానీ బాహుబలి టీం మాత్రం సినిమాకు హైప్ తీసుకురావడానికి లెక్కలు మిక్కిలి చేసి చూపిస్తున్నారనే అపోహ విశ్లేషకుల్లో నెలకొంది..

బాహుబలి మూవీ.. ఖచ్చితంగా దేశం గర్వించదగ్గ సినిమానే.. కానీ దీన్ని వ్యూస్ యూట్యూబ్ లో అంతకంతకు పెరిగిపోతోంది. బాహుబలి టీం యూట్యూబ్ , సోషల్ మీడియాతో ఏం ఒప్పందం చేసుకుందో తెలియదు.. కానీ నమ్మశక్యం కానీ రీతిలో పెరుగుదల కనిపిస్తోంది. అమీర్ ఖాన్ దంగల్ సినిమా మొత్తం ట్రైలర్ వ్యూస్ ఇప్పటికీ 5 కోట్ల 17 లక్షలు ఉన్నాయి. ఇప్పటికీ సినిమా విడుదలై చాలా రోజులైంది. దేశంలో మెజార్టీ జనాభా హిందీ వారే ఉండడంతో ఈ వ్యూస్ సాధ్యమైంది. కానీ దక్షిణాది చిత్రం బాహుబలి హింద్ లో డబ్ అయితే ఆలాంటి క్రేజ్ ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే దంగల్ కు తోడుగా అగ్ర బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఉన్నాడు.. ఇక్కడ అలాంటి స్టార్ లేడు.. కానీ బాహుబలి 8 కోట్ల వ్యూస్ సాధించింది. అదీ మూడు నాలుగు రోజుల్లోనే సాధించారనడం.. ఊదరగొట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

To Top

Send this to a friend