దేశాన్ని షేక్ చేసే నిర్ణయం..


దేశంలోనే అతిపెద్ద సంస్కరణ దిశగా మోడీ అడుగులు వేస్తున్నారు. అదే ‘ఒకే దేశం-ఒకే సారి ఎన్నికలు’.. ఇది అమలైతే.. ఇక తరచూ ఎన్నికలు రావు.. కేంద్రంతోపాటు రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఎన్నికలు రానున్నాయి. మోడీ తెస్తున్న ఈ సంస్కరణ దేశంలోనే గొప్ప ముందడుగు. . ఎందుకంటే ఇన్నాళ్లు అధికారంలోకి వచ్చిన పార్టీ రాష్ట్రాల్లో ఎన్నికలు రాగానే ఎన్నికల కోడ్ తో ఏ పథకాలను అమలు చేసేవారు కాదు. ఏదైనా ప్రభుత్వ పనులను చేయడానికి వీలులేదు. పార్టీ నాయకులందరూ ప్రచారబాట పట్టి ప్రజాసమస్యలు గాలికి వదిలేసేవారు. దీంతో ఎన్నికలు అభివృద్ధికి విఘాతంగా మారేవి. ప్రతీ రాష్ట్రం ఎన్నికల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు, రాజకీయ నాయకుల శ్రమ వృథా అయ్యేది కానీ.. దీంతో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆ డబ్బులు, శ్రమ, అభివృద్ధి సాధ్యమవుతుంది. అమెరికా తరహాలో ఇలా చేయడంలో దేశంలో వేలకోట్ల ధనం వృథాకాదు. పైగా సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రజలకు పాలన చేరవవుతుంది. ఊరికే ఎన్నికల బాధ తప్పుతుంది.

మోడీ లోలోపన మెదిలిన ఈ నిర్ణయాన్ని ఇటీవల ఎన్టీఏ సమావేశంలో మోడీ దేశంలోని వివిధ రాష్ట్రాల నాయకులు, సీఎంలతో పంచుకున్నారు. దీనికి వారు సరేనన్నారు. ఈ ఒకే ఎన్నికలకు దేశంలోని 15 రాష్ట్రాలు ఒప్పుకోవాలి.. కానీ ఇప్పటికే దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, మిత్ర పక్షాలవే 16 ఉన్నాయి. దీంతో దీనిపై రాష్ట్రాల అభ్యంతరాలు ఉండకపోవచ్చు.. ఇక పార్లమెంటులో ఒకే ఎన్నికలపై చట్టం తెచ్చి అమలు చేయడమే మిగిలించి. 2018లో మొత్తం దేశంలోని కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని మోడీ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎన్నికలు జరిగిన రాష్ట్రాల పదవీ కాలాన్ని కుదించడం.. ముగిసిన వాటిని 2018వరకు వాయిదా వేయడం చేస్తారట.. సో మోడీ తీసుకున్న ఈ నిర్ణయం అమలైతే అతిపెద్ద సంస్కరణ దేశాన్ని షేక్ చేయవచ్చు..

To Top

Send this to a friend