దిగ్గజాల చేతుల మీదుగా బాలయ్య చిత్రం


పూరిజగన్నాథ్ దర్శకత్వంలో బాలక్రిష్ణ 101వ చిత్రం మొదలైంది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్ తులసీవనం దేవాలయంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. కథను వేంకటేశ్వరుని పాదాల చెంత ఉంచి యూనిట్ సభ్యులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ప్రారంభోత్సవంలో బాలక్రిష్ణతో పాటు దిగ్గజ దర్శకులు పూరిజగన్నాథ్, రాజమౌళి, బోయపాటి శ్రీను, క్రిష్ తో పాటు అలీ, నందమూరి సభ్యులు, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

కాగా బాలక్రిష్ణ 101 వ చిత్రం కోసం సందేశాత్మక కథను సిద్దం చేశారట పూరిజగన్నాథ్.. బాలక్రిష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ హైదరాబాద్ లో.. రెండో పార్ట్ షూటింగ్ లండన్, స్పెయిన్ లో నిర్వహించనున్నట్టు చిత్రం యూనిట్ తెలిపింది.ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్ ను ఎంపిక చేసినట్టు చిత్రం యూనిట్ తెలిపింది. సెప్టెంబర్ 29న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
బాలయ్య 101 వ చిత్రం ప్రారంభోత్సవ వీడియోను కింద లింక్ లో చూడొచ్చు.

To Top

Send this to a friend