తెలంగాణ చేనేతన్నలకు సమంత అండ.

సమంత.. మరోసారి తనది దయా హృదయమని చాటిచెప్పింది. ఇప్పటికే సమంత గుండెలొ చిల్లుతో బాధపడుతున్న చిన్నారులకు తన సంపాదనలోంచి ఆపరేషన్లు చేయిస్తూ.. వివిధ సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ నటిగానే కాకుండా సమాజసేవకురాలిగా గుర్తింపు పొందింది.. ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేనేతన్నలను ఆదుకునే కార్యక్రమాలకు సమంత అండగా నిలుస్తోంది.

తెలంగాణ ఆప్కో కేంద్రానికి వచ్చిన సమంత అక్కడ మంత్రి కేటీఆర్, పరిశ్రమలు, చేనేత సహకార సంస్థ కమిషనర్ ల సమక్షంలో తాను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కేటీఆర్ కోరిక మేరకు చేనేతల బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకున్న సమంతకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ సమంతకు పోచంపల్లి చీరను బహూకరించారు. తెలంగాణ చేనేతన్నల బతుకు మార్చే ఉద్యమంలో భాగస్వాములైన సమంత నిర్ణయాన్ని సోషల్ మీడియాలో అందరూ వేయినోళ్ల పొగుడుతున్నారు. ఆమె మంచి మనసును అభినందిస్తున్నారు.

To Top

Send this to a friend