తండ్రి షాజహాన్.. కొడుకు ఔరంగజేబు.. మరి పాలన తుగ్లక్ దా..?

ములాయం సింగ్ యాదవ్.. యూపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత ఇప్పటికే ఐదు సార్లు యూపీ సీఎంగా పనిచేసి 2012లో మరోసారి గెలిచాక కొడుకు అఖిలేష్ కు సీఎం పీఠం అప్పగించి దేశరాజకీయాల వైపు ఆయన దృస్టిసారించారు. ములాయం పీఎం కావడమే లక్ష్యంగా పనిచేశారు.. కానీ ఆయన ఆశలు నెరవేరలేదు..

బీజేపీ రంగ ప్రవేశం.. మోడీ మేనియాతో యూపీలో సమాజ్ వాదీ తుడిచిపెట్టుకుపోయింది. ములాయం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ప్రధాని కల చెదిరిన ములాయం దీనంతటికి కొడుకు, సీఎం అఖిలేష్ వైఖరే కారణమంటూ దుమ్మెత్తిపోశాడు. ఆ తర్వాత ఇప్పుడు శాసనసభ ఎన్నికల సాక్షిగా మునపటి అంతర్యుద్ధం బయటపడి సమాజ్ వాదీ చీలిపోయింది. కొడుకు , తండ్రి విడిపోయి కొట్టుకుంటున్నారు.. ఎన్నికల సంఘం నిన్న సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ దే నని.. సైకిల్ గుర్తు ఆయనకే కేటాయించడంతో ములాయం శకం ఇక దేశ, యూపీ రాజకీయాల్లో ముగిసినట్టేనన్న ప్రచారం జరుగుతోంది..

ఇక కొడుకు చేసిన మోసాన్ని తండ్రి ములాయం తట్టుకోలేకపోతున్నాడు. తాను షాజహాన్ వలే యూపీని తాజ్ మహల్ లా నిర్మిస్తే .. ఆయన కొడుకైన ఔరంగజేబులో అన్నింటిని ధ్వంసం చేస్తున్నాడని.. ములాయం తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ముస్లిం వ్యతిరేకి అయిన కొడుకు అఖిలేష్ ను ఓడించాలని రాష్ట్ర ప్రజలను కోరాడు. అంతేకాదు కొడుకును ఓడించడానికి అతడిపైనే పోటీచేస్తానని ములాయం సవాల్ విసరడంతో యూపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి.. కానీ ఈ ఇద్దరు తండ్రీ కొడుకుల పాలనలో యూపీ గాడితప్పింది. దారిదోపిడీ , అత్యాచారాలు, స్వేచ్ఛ స్వాంతంత్ర్యాలు లేకుండా పోయాయి. అధికారపార్టీ అంతర్గత కుమ్ములాటలతో పాలనను పట్టించుకోకపోవడంతో యూపీ ప్రజలు రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులకు వాత పెట్టడానికి రెడీ అవుతున్నట్టు సర్వేలు తేల్చాయి..

To Top

Send this to a friend