ట్రాన్‌స్ట్రాయ్ ని వివాదంలోకి లాగిన పవన్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతిలోని కృష్ణానది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్షేమదాయం కాదని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్‌గా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులు చెప్పాలని పవన్ ప్రశ్నించారు.

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన పోలవరం గుత్తేదారు కంపెనీ ‘ట్రాన్‌స్ట్రాయ్’ అడ్డగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డ్‌గా మార్చేస్తే ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తారో అన్న వివేకం కూడా చూపకపోతే ప్రజాప్రతినిధులను ఏమనుకోవాలని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణ ప్రగతిపై నెలకోమారు సమీక్ష జరుపుతున్న సర్కార్ ఈ సమస్యపై ఎందుకు దృష్టిపెట్టడం లేదో అర్థం కావడం లేదని పవన్ అన్నారు. ‘ఈ భూముల రైతులు తమవారు కాదనా?.. లేదా కాంట్రాక్టర్‌కు ఇబ్బందనా?’ అంటూ తనదైన శైలిలో పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

భూములు పోగొట్టుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని రైతులు తమకు తగిన నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరని, పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారని, ఇది అన్యాయం అని అడిగితే పోలీసులతో కేసులు పెట్టించి వాళ్ల నోళ్లు మూయిస్తున్నారని, ఇది మంచిది కాదని.. ఇకనైనా వాళ్లకు న్యాయం చేయండని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు.

గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం నదీపరివాహకంలో ఉన్న భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకున్నదో లేదో స్పష్టత లేదని జనసేనాని చెప్పారు. ఈ భూములను తీసుకుని ఏం చేస్తారో.

To Top

Send this to a friend