టాలీవుడ్ హీరోలు, క్రీడాకారులకు మంత్రి కేటీఆర్ సవాల్..

ktr-telangana-minister

బస్తీమే సవాల్ .. ఇది సవాల్ కాదు.. ఓ మంచి ప్రయత్నం కోసం కేటీఆర్ చేస్తున్న ప్రయత్నం.. రోజురోజుకు అంతరించిపోతున్న చేనేత వస్త్రాలకు ఆదరణ కల్పించాలని ఆ శాఖ చూస్తున్న మంత్రి కేటీఆర్ తలంచారు. సిరిసిల్ల నియోజకవర్గ నేతన్నల కష్టాలకు చలించి వారు నేస్తున్న దుస్తులకు ఆదరణ కల్పించాలని ఇక నుంచి తాను చేనేత వస్త్రాలే ధరిస్తానని స్పష్టం చేశారు. అందులో భాగంగానే అధికారులు, ప్రజాప్రతినిధులు అలా ధరించాలని ఒకరోజు ఖచ్చితంగా అలానే రావాలని ప్రతిపాధించారు. అది విజయవంతమై ప్రస్తుతం తెలంగాణ అధికారులు, ప్రజాప్రతినిధులు ఫాలో అయ్యిపోతున్నారు..
ఇక రెండో అడుగు కేటీఆర్ స్టార్ హీరోలు, క్రీడాకారులపై పడింది. ట్విట్టర్ తాను చేనేత దుస్తులు ధరించిన ఫోటోను పెట్టి కేటీఆర్ హీరోలు మహేశ్, నాగార్జున, రానా, హీరోయిన్లు సమంత, క్రీడాకారులు సానియా, భూపతి, గోపించంద్ తదితర హీరోలు, క్రీడాకారుకారులకు సవాల్ విసిరారు. చేనేతలకు ఉపాధి కోసం నేను చేనేత దుస్తులు ధరిస్తున్నానని.. మీరు రెడీనా ఆ దుస్తులు ధరించడానికి అని సవాల్ విసిరారు. దీనిపై సానియా సరేనని మరికొందరిని ఆహ్వానించింది. రానా సైతం సవాల్ ను స్వీకరించారు.. కమల్ హాసన్, సైతం తాను ధరిస్తానని చెప్పాడు. ఇక మహేశ్ , నాగార్జున కూడా స్పందించాల్సి ఉంది. దీంతో కేటీఆర్ విసిరన సవాల్ తో కొద్దిగానైనా చేనేతల బతుకులు బాగుపడతాయని ఆశిద్దాం.. ఈ మంచి ప్రయత్నాన్ని ఆహ్వానిద్దాం..

To Top

Send this to a friend