టాలీవుడ్ లో హీరో మలయాళంలో విలన్..

టాలీవుడ్ లోకి మరో అగ్ర హీరో విలన్ గా మారబోతున్నాడు.. ఒకప్పుడు అగ్రహీరోగా ఎదిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తున్న హీరో శ్రీకాంత్ కు అనుకోని పిలుపు వచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేస్తున్న సినిమాలో విలన్ పాత్ర పోషించమని అక్కడినుంచి పిలుపు వచ్చిందట.. సో ఆ పాత్ర చేయడానికి శ్రీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తెలుగుస్టార్ మలయాళంలో విలన్ గా చేస్తుండడంతో ఆ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నట్టు చిత్రం యూనిట్ తెలిపింది..
కాగా ఇప్పటికే తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోలు జగపతిబాబు, సాయికుమార్ లు ప్రస్తుతం విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. ఇప్పుడు విలన్ పాత్రలో మరో సాఫ్ట్ హీరో శ్రీకాంత్ కూడా పరకాయ ప్రవేశం చేస్తున్నారు. దీంతో తెలుగు హీరోలు విలన్లుగా మారడం కొనసాగుతోంది.. అయితే శ్రీకాంత్ లాంటి సాఫ్ట్ లుకింగ్ హీరో విలన్ గా రాణిస్తాడా లేదా అనేది వేచిచూడాలి.. హిట్ అయితే మరో తెలుగు విలన్ మనకు అందుబాటులోకి వచ్చినట్టే..

To Top

Send this to a friend