జియో మాస్టర్ ప్లాన్.. ఉచిత సేవలపై సరికొత్త ఆఫర్

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దెబ్బకు దేశీయ టెలికాం కంపెనీలు కుదేలవుతున్నాయి. మరో వైపు ప్రజలు మాత్రం చవకగా ఫ్రీగా వస్తున్న జియో 4జీ సర్వీసులను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గత అక్టోబర్ నుంచే జియో 4జీ ఉచిత సేవలను అందించిన జియో.. ఆ తర్వాత న్యూ ఇయర్ కానుకగా వెల్ కం ఆఫర్ అంటూ మరో 3 నెలల పాటు ఉచితసేవలను పొడిగించింది.. దీంతో మార్చి వరకు కూడా జియో కస్టమర్లు ఉచిత సేవలు పొందుతున్నారు.

మరోవైపు జియో దెబ్బకు కుదేలయిన ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ తదితర కంపెనీలు దిక్కుతోచని పరిస్థితుల్లో డేటా సేవలను తగ్గించాయి. మరోవైపు కేంద్ర టెలికాం అథారిటీకి జియోపై ఫిర్యాదు చేశాయి. ఉచిత సేవలతో వ్యాపారం దెబ్బతీస్తున్నారని.. దీన్ని అరికట్టాలని సూచించాయి దీంతో ట్రాయ్ జియోకు నోటీసులు ఇవ్వడం.. జియో కొన్ని పరిమితులతో ఉచిత సేవలను కొనసాగిస్తుండడం జరిగిపోయింది..

ఇప్పుడు ముఖేష్ అంబానీ ఎయిర్ టెల్, ఐడియా ఇతర టెలికాం కంపెనీలకు మరో గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.. కొత్తగా 100 రూపాయల రుసుముతో ఫ్రీ డేటా, కాల్స్, ఎస్ఎమ్మెస్, అందించేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే అటు ట్రాయ్ సూచనలు పట్టించుకున్నట్టు అవుతుంది. ఇటు ప్రత్యర్థి టెలికాం కంపెనీలను తక్కువ ధరకు ఉచిత సేవలు అందించి దెబ్బతీసినట్టు అవుతుంది. ఒకే దెబ్బకు చాలా సమస్యలు తీరిపోయే ఈ జియో ప్లాన్ ప్రస్తుతం మిగతా టెలికాం కంపెనీలను కలవరపెడుతోంది..

To Top

Send this to a friend