చిరు, బాలయ్య సినిమాలపై మహేశ్ బాబు కామెంట్

చిరంజీవి , బాలయ్య లు సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఖైదీ, శాతకర్ణి సినిమాలపై మరో అగ్ర హీరో మహేశ్ బాబు స్పందించాడు. నొప్పించక, తానొవ్వక అంటూ ఈ అగ్రహీరోల మధ్య పెట్రోల్ పోయకుండా న్యూట్రల్ గా స్పందించి ఈ వివాదాల జోలికి వెళ్లకుండా ఇద్దరినీ సంతృప్తి పరిచేలా ట్వీట్ చేసి శభాష్ అనిపించుకున్నారు.. సంక్రాంతి పండుగ సందర్భంగా తీరిక వేళ ఈ రెండు సినిమాలను చూసిన మహేశ్ ట్విట్టర్ లో స్పందించారు..

మహేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ ‘‘ ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో విజయాల వాన కురుస్తోంది.. రెండు పెద్ద సినిమాలను చూడ్డానికి పండుగ వేళ కాసింత తీరిక దొరికింది.. చిరు మ్యాజిక్ బాగుంది.. చాలా సంవత్సరాలుగా ఆయన్ని మిస్ అయ్యాం.. రీఎంట్రీ ఇచ్చిన బాస్ ఈజ్ బ్యాక్ గ్రేట్.. ‘‘ అంటూ చిరును ఆకాశానికెత్తేశారు..

ఇక బాలయ్య సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘హేట్సాఫ్ బాలకృష్ణ గారు.. చరిత్రను అద్భుతంగా చూపించిన చిత్రయూనిట్ కు అభినందనలు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఇలాంటి సినిమా అవసరం.. మీ విజన్ కు.. గర్వపడుతున్నా. చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ ’’ అంటూ బాలయ్య సినిమాను పొగిడేశాడు.. ఇలా ఎవ్వరిని నొప్పించక తానొవ్వక చందంగా సాగిన మహేశ్ ట్వీట్ గాథ ఇద్దరు అగ్ర హీరోలను సాటిస్ ఫై చేసింది..

To Top

Send this to a friend