చిరు ‘ఉయ్యాలవాడ’పై బ్రేకింగ్ న్యూస్


చిరంజీవి చారిత్రక సినిమా మొదలవబోతోంది. చిరు తన 151వ సినిమాను ఏప్రిల్ లో ప్రారంభించనున్నారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమైన 1857 కంటే ముందే బ్రిటీష్ పాలకులపై తిరుగుబాబు చేసి వారికి కంటి మీద కునుకు లేకుండా చేసిన తెలుగు స్వాతంత్ర్య సమయయోధుడి జీవిత చరిత్రను తెరపై ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గా చూపించేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు.. ఈ పేరుతో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్ పై ఫిల్మ్ చాంబర్ లో టైటిల్ రిజిస్ట్రర్ చేయించారు. రాంచరణ్ ను ధృవ సినిమాతో హిట్ కొట్టించిన దర్శకుడు సురేందర్ రెడ్డిని ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడిగా చిరంజీవి ఎంచుకున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని చివరి దశలో ఉంది. నరసింహారెడ్డి పై వచ్చిన పుస్తకాలను అధ్యయనం చేయడంతో పాటు, ఆయన కుటుంబీకుల నుంచి సమాచారాన్ని సేకరించి పరుచూరి సోదరులతో కలిసి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో దర్శకుడు సురేందర్ రెడ్డి బిజీగా ఉన్నారు.

వాస్తవానికి చిరంజీవి తన 150వ సినిమాగానే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’కథను ఎంచుకుంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే దానికి కథ కోసం పరిచూరి బ్రదర్స్ పరిశోధన చేయడం.. చారిత్రక అంశాలు, సెట్ లు, సమయం ఎక్కువ కావడంతో ఈలోగానే రెగ్యులర్ కమర్షియల్ సినిమావైపు చిరంజీవి మొగ్గుచూపారు. దీంతో తమిళ కత్తిని ఖైదీనంబర్ 150గా రిమేక్ చేశారు. దాని తర్వాత ఉయ్యాలవాడ సబ్జెక్టుపై దృష్టిపెట్టారు.

అల్లూరి సీతారామరాజు తరహాలోనే సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న నరసింహారెడ్డి రాయలసీమ ప్రాంతంలో బ్రిటీష్ పాలకుల అక్రమ పన్ను వసూళ్లు, దమనఖాండకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదేశారు. నల్లమల అడవుల్ని కేంద్రంగా చేసుకొని వాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు ద్రోహులిచ్చిన సమాచారంతో బ్రిటీష్ వారు ఆయన్ను బ్లాక్ మెయిల్ చేసి 1847 ఫ్రిబవరి 22న ఉరితీశారు. అలాంటి గొప్ప యోధుడి పాత్రను చిరంజీవి పోషించనుండడంతో అందరి దృష్టి దానిపైనే ఉంది. దానికి తగ్గట్లే భారీ బడ్జెట్ తో దీన్ని తీసేందుకు రాంచరణ్ మరోసారి నిర్మాతగా మారబోతున్నారు. 2018 వేసవిలో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది..

To Top

Send this to a friend