చంద్రబాబు కూర్పు వెనుక పెద్ద కథే…

కొత్త కేబినెట్ లో చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అణగారిన, బీసీ వర్గాలకు పెద్ద పీట వేసి రాబోయే ఎన్నికలకు గురిపెట్టారు. చంద్రబాబు వచ్చే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు పెద్ద పీట వేశారు. చంద్రబాబు కేబినెట్ లో బీసీలు అత్యధిక స్థాయిలో 30.8శాతం మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు సామాజికవర్గమైన కమ్మ నేతలు 23.1శాతం, రెడ్డి , కాపులు 15.4శాతంతో సమానంగా సీట్లు పొందారు. ఎస్సీ 7.7, ఇతర కులాలు 7.9శాతం మంది పదవులు పొందారు..

చంద్రబాబు తనకూ దూరమైన కాపులు, బీసీలు టార్గెట్ గా మంత్రివర్గ విస్తరణ చేసినట్టు రుజువైంది. కేబినెట్ లో అత్యధికంగా బీసీలకు చోటిచ్చి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందుకే దిగ్గజాలుగా ఉన్న సీనియర్ మంత్రులను కూడా ఏకపక్షంగా తీసిసి బడుగులకు చోటిచ్చారు. సీనియర్లైన బొజ్జల, చింతమనేని, బోండా గోరంట్లలు మంత్రి పదవులు దక్కకపోయే సరికి అలకబూని రాజీనామాలకు సిద్ధపడినా వారికి మైండ్ వాష్ చేసి చంద్రబాబు కొంతలో కొంత అగ్రహజ్వాలను తగ్గించారు.

ఇదే కాదు.. జగన్ చాలా బలంగా ఉన్న రాయలసీమ లో ఎమ్మెల్సీ ఎన్నికలను కొల్లగొట్టిన టీడీపీ.. ఆ గెలుపులో కీలకపాత్ర పోషించిన ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకొని జగన్ కు షాక్ ఇచ్చారు. అంతేకాదు.. రాయలసీమలోనే బలంగా ఉన్న భూమా అఖిల ప్రియ, కాల్వశ్రీనివాసులు, అమర్ నాథ్ రెడ్డి, లను మంత్రివర్గంలో చోటిచ్చారు. వీరు బలమైన నేతలు కావడం.. వైసీపీ నుంచే కొందరు టీడీపీలో చేరడంతో ఆ పార్టీని బలహీనపరచడంలో భాగంగానే చంద్రబాబు ఈ ఎత్తు వేసినట్టు స్పష్టమైంది..

ఇలా సామాజిక, రాజకీయ అన్ని కోణాల్లో చంద్రబాబు పకడ్బందీగా మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చేసి 2019 ఎన్నికలకు తన బ్యాచ్ ను సిద్ధం చేశారు. ఇలానే ముందుకెళ్లి జగన్ దెబ్బతీయాలని చూస్తున్నారు.కాగా మంత్రి పదవులు దక్కని కొందరు టీడీపీ నేతలు జగన్ పార్టీలో చేరాలని ప్రయత్నాలు ప్రారంభించడం విశేషం..

To Top

Send this to a friend