గ్యాప్ వచ్చినా మెగాస్టార్ ‘తుని’ సెంటిమెంట్ మారలేదు!

మెగాస్టార్ చిరు స్టామినా ఎక్కడా తగ్గలేదని రుజువైంది.. కెరటంలా పడిన చోట చిరు గ్రాండ్ ఎగిసిపడ్డాడు.. పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన చిరు ఖైదీనంబర్ 150 సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. పాత చిరు సినిమాల రికార్డులనే తిరగరాస్తోంది..

చిరంజీవికి తునికి అనుబంధం ఉంది. అక్కడ ఆయన తీసిన సినిమాలు రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తుంటాయి. చిరు గతంలో నటించిన ఇంద్ర సినిమా తుని-పాయకరావుపేట సర్కిల్ లో 18లక్షల షేర్ కలెక్ట్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. తర్వాత ఈ రికార్డు ను ఏ సినిమా హీరో బద్దలు కొట్టేకపోయారు. ఆరోజుల్లో 18 లక్షల షేర్ అంటే ఇప్పటికి కోట్లతో సమానం.. టికెట్ రేట్ పెరిగినా.. ఎన్ని వేలు అయినా సరే ఇక్కడ చిరు సినిమాను చూసేందుకు అభిమానులు వెనుకాడేవారు కాదు..

తుని సెంటిమెంటును చివరకు చిరుయే బ్రేక్ చేశారు. చిరు ఖైదీనంబర్ 150 మూవీ తునిలో 11వ రోజు18.74 లక్షల షేర్ వసూలు చేసి ఇంద్ర రికార్డును బ్రేక్ చేసింది.. ఏ హీరోకు సాధ్యం కానీ ఫీట్ ను చివరకు తానే బద్దలు కొట్టి చిరు ఔరా అనిపించారు. ఎన్ని రోజులు గ్యాప్ వచ్చినా సరే బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించారు..

To Top

Send this to a friend