గూగుల్ లో చూసినా గొర్రెలే


కేసీఆర్ మాట.. అది ఏదైనా ప్రభంజనంలా జనంలోకి వెళ్తుంది. ఆయన ఆలోచించి మాట్లాడడో లేదా తెలంగాణ యాదవ కులస్థులకు నిజంగా హామీ ఇచ్చాడో తెలియదు కానీ ఒక్క మాట ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సెటైర్లు పడేలా చేస్తోంది..

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో గొర్రెల సంఖ్య 4కోట్లకు చేరుతుందని కేసీఆర్ అసెంబ్లీలో ఆర్భాటంగా ప్రకటించారు. సర్కారు పెద్దలు చెబుతున్న మాట అసాధ్యమంటూ సోషల్ మీడియాలో అందరూ ఆడిపోసుకుంటున్నారు.. కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం చూస్తే తెలంగాణలో జనాభాకు సరిసమానంగా గొర్రెలు ఉంటాయన్న మాట..

అంటే బహిరంగ ప్రదేశాల్లో, మార్కెట్లలో ఉన్నట్టు గొర్రెల మందలు విరివిగా కనిపిస్తాయన్నమాట… ఎవరైనా తెలంగాణ భూభాగాన్ని గూగుల్ లో చూస్తే… ఎక్కడబడితే అక్కడ గొర్రెలే దర్శనమిస్తాయేమో…? ఊహిస్తుంటేనే మస్తు చిత్రంగా అనిపిస్తున్నది కదా..?

కానీ ఇది కేసీఆర్ మాట.. ఆయన చెప్పిన ప్రకారం 80 లక్షల వరకు గొర్రెలను ఇతర రాష్ట్రాలు, దేశాలనుంచి దిగుమతి చేస్తారట.. సంవత్సరానికి రెండు పిల్లలు పుట్టినా నాలుగు కోట్లు కేవలం రెండేళ్లలో అవుతాయన్నమాట.. ఈ లెక్కన తెలంగాణ జనాభాను మించి అంతటా గొర్రెలే కనిపిస్తాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు..

దీనిపై తెలంగాణ వ్యాప్తంగా యాదవులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తుంటారు.. కానీ తెరవెనుక గొర్రెలన్నీ ఆడగొర్రెలే తీసుకొస్తారా.. వాటికి పుట్టినవన్నీ బతికి బట్టకడతాయి.. ప్రతీ ఆదివారం మటన్ కోసం ఎన్ని గొర్రెలు బలి అవుతాయి.. ఇలా లెక్కలన్నీ వేయకుండా రెండేళ్లలో నాలుగు కోట్ల గొర్రెలు ఉంటే తెలంగాణ మొత్తం జనాలతో కాకుండా గొర్రెలతోనే కనపడుతుంది కాదంటారా..? .

To Top

Send this to a friend