గురుభక్తికి మోడీ గులాం..


రాజకీయాల్లో, వ్యక్తిగతంగా ఎంత ఎదిగినా మూలాలు మరిచిపోవద్దు.. ఆ మూలాలే సాదాసీదా జీవితమే మనల్ని ఉన్నతులుగా నిలబెడుతుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని జయించిన మోడీలో కించత్ గర్వం కూడా కనిపించలేదు. పైగా దాన్నో సదవాకాశంగా ఆయన మలుచుకొని తన గురుభక్తిని చాటుకోవడానికి వడివడిగా అడుగులు వేయడం గమనార్హం..

యూపీ ఫలితాలు వెలువడ్డాక ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు బీజేపీ కురు వృద్ధుడు అడ్వాణి, జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మోడీ తన మనసులోని మాటను వాళ్లతో పంచుకున్నారట.. తాను యూపీలో విజయం కోసం అహర్నిషలు కృషి చేశానని.. ఎందుకంటే యూపీలో గెలిస్తేనే బీజేపీ రాష్ట్రపతి పీఠాన్ని ఎవ్వరి అవసరం లేకుండానే సొంతంగా చేజిక్కించుకోగలదన్నారు. యూపీ విజయం ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీకి కలిసివచ్చిందన్నారు.. యూపీలో గెలిచి తన గురువు అడ్వాణిని రాష్ట్రపతిని చేయాలన్నదే నా కల అని మోడీ వారితో చెప్పారట.. దీంతో అడ్వాణి తన ప్రధాని కల నెరవేరకున్నా.. దేశంలోనే అత్యున్నత పీఠం రాష్ట్రపతి పదవి అలంకరించబోతున్నారు. మోడీ ఇస్తున్న ఈ కానుక నిజంగా అడ్వాణికి అపురూపమైందే…

నిజానికి బీజేపీలో ఇప్పుడు వాజ్ పేయి తర్వాత అడ్వాణియే సీనియర్ కానీ మోడీ ఒంటిచేత్తో బీజేపీని అధికారంలోకి తెచ్చారు. అందుకే ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మోడీకే అధికారం కట్టబెట్టారు. అప్పట్లో దీనికి నిరసనగా రాజీనామా చేసిన అడ్వాణిని రాష్ట్రపతిని చేస్తామని హామీఇచ్చారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అందుకే అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మోడీ కూడా అడ్వాణిని రాష్ట్రపతిని చేయాలని డిసైడ్ కావడం శుభపరిణామం.. బీజేపీ కురవృద్ధుడికి ఇన్నాళ్లకు అదీ మోడీ స్టామినా వల్ల అత్యున్నత పదవి వరించబోతోంది..

To Top

Send this to a friend