గవర్నర్ చంద్రబాబుకు ఎసరు పెడుతున్నాడా..?

సంచలనం.. ఓటు నోటు కేసులో ఇదో ట్విస్ట్.. అందరూ అనుకున్నట్టు సమర్థ అధికారి చారుసిన్హాను తెలంగాణ ప్రభుత్వం మాట విననందుకు సస్పెండ్ చేసిందనుకున్నాం.. కానీ ఆ మాట ఏంటనేది స్పష్టంగా ఎవ్వరికీ తెలీదు.. కానీ ఇప్పుడు తెలిసింది. అదీ మొత్తం చంద్రబాబు మెడకు ఉరితాడై బిగుస్తోంది.  ఓటుకు నోటు కేసులో గతనెల 18న తెలంగాణ ఏసీబీ కోర్టులో అదనపు చార్జిషీట్ వేసింది. అంతకుముందు మాజీ ఏసీబీ డీజీగా పనిచేసిన ఏకే ఖాన్ రిటైర్ అయ్యాక ఏసీబీ కార్యాలయానికి వచ్చి దీనిపై సమీక్షించారట.. ప్రస్తుత డైరెక్టర్ చారుసిన్హాను పక్కకు పెట్టి ఆయనే అన్నీ వ్యవహారాలు నడిపి కోర్టులో చార్జిషీట్ వేయించారని సమాచారం. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన గవర్నర్ నరసింహన్, రాజ్ భవన్ వర్గాలు కేసును నీరుగారుస్తున్నారన్న విషయం తెలుసుకొని ఆ చార్జీషీట్ కాపీని తమకు ఇవ్వవలసిందిగా ప్రస్తుత ఏసీబీ డైరెక్టర్ చారుసిన్హాను కోరారట.. దీనికి ఆమె ఒప్పుకొని రాజ్ భవన్ వెళ్లి పత్రాలు అందజేశారు. ఆ పత్రాలు తీసుకొని గవర్నర్ నరసింహన్ నేరుగా ప్రధాని, రాష్ట్రపతికి, అటార్నీ జనరల్, సుప్రీం చీఫ్ జస్టిస్ లకు  అందజేసి బాబు మెడకు ఉచ్చు బిగించారు.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి చెప్పకుండా ఏసీబీ డైరెక్టర్ చారుసిన్హా గవర్నర్ చార్జిషీట్ కాపీని అందజేసినందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేసింది.

అసలు గవర్నర్ చంద్రబాబు ఓటుకు నోటు కేసు చార్జిషీట్ అడగడం.. ఢిల్లీకి వెళ్లి ఆ కాపీని ప్రధానికి అందజేయడంతో లోలోపల చంద్రబాబు ఒత్తిడి పెరిగిపోయింది. తనను గవర్నర్ ఇరికించారా..? అన్న ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోడీ సీరియస్ గా స్పందిస్తే బాబు కటకటాల పాలు కావాల్సిందే.. ఇంత సీక్రెట్ గా విషయం జరిగిపోవడంతో చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది..

To Top

Send this to a friend