కోహ్లీ, కుంబ్లే నమ్మకమే గెలిపించింది..

యెజువేంద్ర చాహల్.. బక్కపలుచటి క్రికెటర్ పేరు ఈరోజు మారు మోగిపోతోంది.. చాహల్ లెగ్ స్పిన్నర్.. బాగానే బంతిని తిప్పగలడు. అసలు అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రాలాంటి దిగ్గజ స్పిన్నర్లున్న భారత జట్టులోకి ఈ కొత్త చాహల్ ఎంపికవడమే ఆశ్చర్యం.. మరీ సీనియర్ మిశ్రాను పక్కనపెట్టి తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో జట్టులోకి వచ్చాడు. చివరి మూడు వన్డేలు ముగిసేసరికి విశేషంగా రాణించి భారత జట్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోశించాడు.. అతడిని నడిపించింది కేవలం కోహ్లీ, కోచ్ కుంబ్లే నమ్మకమే..
అవును కోహ్లీ చాహల్ ను నమ్మాడు. ఐపీఎల్ బెంగలూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ జట్టులో చాహల్ సభ్యుడు.. మునుపు ధోని నాయకత్వం కాబట్టి జట్టులో ఎవరిని ఉంచాలో తీసేయాలో ధోనీ ఇష్టం ఉండేది.. కానీ ఇప్పుడు కోహ్లీ పగ్గాలు చేపట్టడంతో నాణ్యమైన ఆటగాళ్లు మళ్లీ తిరిగి జట్టులోకి వస్తున్నారు. యువరాజ్ జట్టులోకి వచ్చినట్టే యువ సంచలనం చాహల్ ను ఏరికోరి కోహ్లీ జట్టులోకి తీసుకున్నారు. బెంగలూరు తరఫున బాగా ఆడిన చాహల్ ను జట్టులోకి తీసుకొని ప్రోత్సహించాడు కోహ్లీ..

మూడో టీట్వంటీలో చాహల్ తొలిస్పెల్ లో పెద్దగా రాణించలేదు. కానీ రెండో ఓవర్ నుంచి మ్యాజిక్ చేశాడు. ఒక్కో ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. మొత్తంగా టీట్వంటీలో ఎవ్వరినీ సాధ్యంకాని 6 వికెట్లు సాధించి తనను ఎంపిక చేసిన కోహ్లీ, కుంబ్లే నిర్ణయం తప్పుకాదని చాటిచెప్పాడు.. జట్టు విజయంలో కీలక పాత్ర పోశించి ఏకంగా మ్యాన్ ఆఫ్ ది సిరిస్ ఆవార్డును గెలుపొందడం విశేషం..

To Top

Send this to a friend