కోహ్లీని తప్పించారా..? తప్పుకున్నాడా.?

ఆస్ట్రేలియాతో హోరాహోరీగా సాగుతున్న నాలుగో టెస్ట్ లో కోహ్లీ ఆడకపోవడం సంచలనం రేపింది. మూడో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లీ గాయపడ్డారు. ఆ తర్వాత మైదానాన్ని వీడి రెస్ట్ తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కూడా చేశాడు. కానీ నాలుగో టెస్ట్ వచ్చే సరికి తప్పుకున్నాడు..? కోహ్లీని తప్పుకున్నాడా.? తప్పించారా అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది.

కోహ్లీ ఆస్ట్రేలియాతో సిరీస్ లో పెద్దగా రాణించడం లేదు. అదే సమయంలో ప్రత్యర్థి అసీస్ కెప్టెన్ మాత్రం చెలరేగిపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. కానీ ఒకనొక డీఆర్ఎస్ వివాదంలో ఇరుక్కొని అసీస్ కెప్టెన్ సారీ చెప్పాడు. ఆ వివాదం ఆస్ట్రేలియా పరువు తీసింది. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి రభస చేసింది కోహ్లీనే.. అయితే ఇండియా గెలుపు బాట పట్టించడంలో కోహ్లీ విఫలమవడం.. బ్యాటింగ్ లో రాణించకపోవడంతో కావాలనే కోహ్లీకి రెస్ట్ ఇచ్చి ఇద్దరు కొత్త కుర్రాళ్లను జట్టులోకి తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది..

నాలుగో టెస్ట్ కోసం ఫాం లేని కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. జట్టులోకి ఇద్దరు సూపర్ ఫాంలో ఉన్న కుర్రాళ్లను తీసుకున్నారు. స్పిన్నర్ కులదీప్ యాదవ్, రంజీల్లో పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ లను జట్టులోకి తీసుకున్నారు. ఈ జట్టు ఎత్తుగడ ఫలించింది. ఆస్ట్రేలియా తొలిరోజే ఆలౌట్ అయ్యింది. ముఖ్యంగా యువ బౌలర్ కులదీప్ చెలరేగాడు. 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనంలో కీలకపాత్ర పోషించాడు.

ఒకరకంగా టీం మేనేజ్ మెంట్ కోహ్లీని తప్పించి ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఉద్రిక్తతలు తగ్గించింది. అదే సమయంలో యువ ఆటగాళ్లను తీసుకొని జట్టు విజయానికి బాటలు వేసింది. కోహ్లీని తప్పించినా.. తప్పుకున్నా నాలుగోటెస్టు లో భారత్ కు శుభారంభం అయితే దక్కింది.

To Top

Send this to a friend