కోదండరాం విలనా..? వెనుక కేసీఆరా.?.

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు జేఏసీ చైర్మన్ కోదండరాం.. భారతంతో పోల్చితే తెలంగాణకు కోదండ రాం కృష్ణుడైతే.. యుద్ధం చేసిన అర్జునుడు కేసీఆర్.. చివరకు వీరిద్దరి వల్లే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైంది. అంతవరకు ఓకే .. తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ కోదండరాంను పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు.కానీ కోదండ రాం అప్పట్లో రాజకీయాలొద్దు అని ఊరుకున్నారు. అక్కడి తో ఆ లొల్లి ఆగలేదు..
ఇప్పుడు జేఏసీ పేరుతో ఏకంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేపడుతున్నారు. దీని వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందన్న ప్రచారం ఉంది. ఏదీ ఏమైనా ఇద్దరు మిత్రులు కోదండ రాం, కేసీఆర్ లు ఇప్పుడు వైరి శత్రువులుగా తెలంగాణలో ఫైట్ చేస్తున్నారు.

కొద్దిరోజులుగా కోదండరాంకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైరం ముదిరిపాకన పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న కోదండరాంను టార్గెట్ చేశారు కేసీఆర్… ఎలాగైనా కోదండరాంను ఏకాకిని చేసేందుకు ప్లాన్ చేశారు . అందులో భాగంగానే జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్ చర్యలు కేసీఆర్ కు కలిసివచ్చాయి. టీజేఏసీలో కోదండరాం వైఖరి నచ్చక పిట్లల రవీందర్ బయటకు వచ్చారు. కోదండపై విమర్శలు గుప్పించారు. టీజేఏసీలో ప్రజాస్వామ్యం లేదని.. కోదండరాం ఒక పార్టీతో.. ఓ సామాజికవర్గ నేతలతో రహస్య మంతనాలు జరుపుతూ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నట్టు రవీందర్ ఆరోపించారు.

ఈ ఆరోపణలతో టీజేఏసీ -కోదండరాం పై విమర్శలు వచ్చాయి. పిట్టల రవీందర్ ఇలా బయటకు వచ్చి ఆరోపణలు చేయడం వెనుక టీఆర్ఎస్- కేసీఆర్ హస్తం ఉందన్న అనుమానాలు లేకపోలేదు. మొత్తానికి కోదండను దెబ్బకొట్టాలన్న టీఆర్ఎస్ వ్యూహానికి జేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ బాగా పనికివస్తున్నాడు..

To Top

Send this to a friend