కొత్తదనమే ‘ఆకతాయి’ 

సినిమా : ఆకతాయి..
నిర్మాతలు : విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్
కథ, మాటలు, దర్శకత్వం : రామ్ భీమన
నటీనటులు : ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్, రాంకీ, సుమన్, రాశి, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, అజయ్ ఘెష్, బ్రహ్మానందం, పృథ్వా
సంగీతం : మణిశర్మ

అంతా కొత్తవారే.. సినిమా ఇండస్ట్రీపై ఆశలతో వచ్చినవారే.. ఆ కసితోనే సినిమా తీశారు.. తెలుగు తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నూతన హీరో ఆశిష్ రాజ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకతాయి’. ఈ సినిమాను విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ త్రయం నిర్మించింది. హీరోయిన్ గా కొత్త నటి రుక్సార్ మీర్ తెలుగుతెరకు పరిచయం అయ్యింది. కోటి ఆశలతో ఆకతాయి తీసి ప్రేక్షకుల ముందుంచారు. సినిమా కంటెంట్ లోకి వెళదాం…

కథ:
ఈ కథ కూడా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. కాలేజీ నేపథ్యంలో కొనసాగుతుంది.. సుమన్, రాశి ల ముద్దుల తనయుడు హీరో ఆశిష్ రాజ్.. ఆశిష్ కాలేజీలోనే హీరోయిన్ రుక్సార్ మీర్ చేరుతుంది. ఆశిష్ మంచి తనం చూసి పరిచయం పెంచుకుంటుంది. అనంతరం ప్రేమగా మారుతుంది. దీంతో ధైర్యం చేసి హీరో తన తల్లిదండ్రులకు ప్రేమ విషయాన్ని చెబుతాడు. ఈ లోగా హీరోయిన్ ఒకసారి హీరో తల్లిదండ్రులు తమ కొడుకు పేరు మీద కర్మఖాండలు చేయడం చూస్తుంది. దీనిపై హీరోను నిలదీస్తుంది. నువ్వు బతికుండగా కర్మఖాండలు చేస్తున్నారంటే నువ్వు అస్సలు కొడుకువు కదా అని ప్రశ్నిస్తుంది. అక్కడే కథ మలుపుతిరుగుతుంది.. ఈలోపు ముంబై నుంచి వచ్చిన ఓ మాఫియా హీరో తల్లిదండ్రులను చంపుతారు. హీరోపై కూడా దాడిచేస్తే విక్రమ్ సింహా అనే వ్యక్తి కాపాడి ఓ నిజం చెబుతాడు. హీరో ఎవరి కొడుకు అనే మిస్టరీ ఆసక్తి రేపుతుంది. అసలు గ్యాంగ్ తన తల్లిదండ్రులను ఎందుకు చంపింది. కర్మఖాండలు ఎందుకు పెట్టారు. గ్యాంగ్ కు, తల్లిదండ్రులకు ఏంటి సంబంధం అనేది ట్విస్ట్..

విశ్లేషణ:
నటన, గ్లామర్, హావభావాలు , ఫైట్స్ ,డాన్స్ ఎలా చూసినా హీరో అశిష్ ను చూస్తే ఇదే అతడి తొలిసినిమా అనే భావనే కనిపించదు.. అంతలా తెరపై అదరగొట్టేశాడు.. హీరోయిన్ రుక్సార్ అందాలతో కుర్రకారు మతి పోగొట్టింది.. ఇక కీలక పాత్రల్లో నటించిన దిగ్గజ నటులు సుమన్, రాశి, ప్రదీప్ రావత్, పోసాని, అజయ్ ఘోష్ లు తమ పాత్రల్లో ఒదిగిపోయి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. కీరోల్ వంటి పాత్రలో నటించిన రాంకీ అదరగొట్టేశాడు. ఫృథ్వీ, బ్రహ్మానందం కామెడీ కితకితలు పెట్టిస్తుంది. దర్శకుడు రామ్ భీమన కథలో కొత్తదనం కనిపించింది. కమర్షియల్ సినిమాకు ట్విస్ట్ లు, ఆసక్తికర కథనాన్ని జోడించి ప్రేక్షకులను కడదాక సినిమాపై హైప్ ను కొనసాగించాడు. ఇంటర్వెల్ ముందు 15 నిమిసాలు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో సీట్లకు అతుక్కుపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సెకాండ్ ఆఫ్ లో హీరో తల్లిదండ్రులను చంపిన దానిపై రివేంజ్ డ్రామా.. హీరో ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తితో సినిమా కొనసాగడం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని నింపుతుంది.. మెయిన్ విలన్ ప్రదీప్ రావత్ , గ్యాంగ్ , హీరోపై దాడులు,ప్రతి వ్యూహాలు సినిమాపై ఆసక్తిని రేపుతాయి.. సీనియర్ మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫీ గొప్పగా ఉంది. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కమర్సియల్ కథను చక్కగా రూపొందించిన దర్శకుడు రామ్ 2.30 గంటలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడనడంలో ఎలాంటి సందేహం లేదు..

apnewsonline.in రేటింగ్: 3/5

To Top

Send this to a friend