కేసీఆర్ వెంట అభిమాన సంద్రం..


ఏ టీవీ చానల్ చూసినా అదే యాడ్.. ఏ పత్రిక చూసినా అదే ప్రకటన.. ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఆయన అభిమానులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పండుగ చేసుకున్నారు. సోషల్ మీడియాలోనైతే కేసీఆర్ మేనియా నడించింది. ప్రతి పోస్టు కేసీఆర్ కు బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పినవారే.. మొత్తంగా ఆయన అభిమాన సంద్రం ఈరోజు పండుగ చేసుకుంది.
సీఎం కేసీఆర్ తన పుట్టిన రోజు కానుకగా సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం నివాసం ప్రగతి భవన్ లో ఈరోజు సాధారణ ప్రజలను కలుసుకునే గొప్ప కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రజలను కలుసుకునేందుకు కేసీఆర్ ‘జనహిత’ పేరుతో క్యాంపు ఆఫీసులో కార్యక్రమం మొదలుపెట్టారు. వెనుకబడిన, పేద వర్గాలను కలుసుకోనున్నారు. అంతేకాదు జనాల అభిప్రాయం ప్రకారం వారి డిమాండ్లు, కోరికల మేరకు వచ్చే బడ్జెట్ లో నిధులు కూడా కేసీఆర్ కేటాయిస్తారు. అవసరాల మేరకు ప్రణాళికలు రచిస్తారు. కేసీఆర్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి జనం నుంచి స్పందన కూడా బాగుంది. తొలిరోజు కేసీఆర్ .. అసువులు బాసిన జర్నలిస్టుల కుటుంబాలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కులసంఘాలు, బీసీలతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమం కేసీఆర్ జన్మదినం రోజు ప్రారంభమవడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు..

To Top

Send this to a friend