కేసీఆర్ కు 50 కోట్లు.. ఎమ్మెల్యేలకు 100 కోట్లు


తెలంగాణలో విచ్చల విడితనం విపరీతంగా పెరిగిపోయింది. రాజు కేసీఆర్ కు ఈ ప్రజాధనంపై లెక్కలేదు.. ఆయన పరివారం, ఎమ్మెల్యేలకు లెక్కలేదు.. ప్రజాధనం కేసీఆర్ పప్పు బెల్లాల్ల పంచడానికి రెడీ అయ్యారు. వీరి విలాసాలకే ప్రజాధనం పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల కింద తన కోసం 50 కోట్లు పెట్టి మహా రాజమందిరాన్ని నిర్మించుకున్నారు. బేగం పేట నివాసం నుంచి ఈ బంగళాలోకి మారారు. అదో రాజభవనమని.. 100 రూములు, కాన్ఫరెన్స్ హాలు, ఇతర హంగులు ఆర్భాటాలు కళ్లుచెదిరేలా ఉన్నాయని చూసినవాళ్లు చెబుతున్నారు. ఇదో రాజసౌధమని అందరూ అంటున్నారు. ప్రజల సొమ్మును ఇలా తమ అవసరాల కోసం వాడుకోవడమై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక తాజాగా 104 నియోజకవర్గాల్లో 100 కోట్ల రూపాయల ఖర్చుతో తమ పార్టీ ఎమ్మెల్యేలకు సైతం ఇలాగే బిల్డింగులు నిర్మించాలనే యోచనలో ఉన్నారు కేసీఆర్.. ఈ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండడానికి వారి సమస్యల పరిష్కారానికి ఈ బిల్డింగులు నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల నివాసాలు ప్రజా ఆవాసాలకు దూరంగా ఉన్నాయని.. అందుకే ఎమ్మెల్యేల కోసం నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఇళ్లు కడుతున్నట్టు చెబుతున్నారు. మొట్టమొదటగా వరంగల్ జిల్లాలోని పరకాలలో ఈ మొదటి ఎమ్మెల్యే భవనాన్ని నిర్మించారు. రెండతస్తుల ఈ భవనం ఎమ్మెల్యేలకు భవనాల నిర్మాణాల్లో మొదటిది. దీన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇలా 100 కోట్లు ఎమ్మెల్యేలకు, 50 కోట్లు కేసీఆర్ కు కేటాయించి ఇలా ప్రజాధనాన్ని కేసీఆర్ అండ్ కో ఇలా వాడుకుంటోంది..

To Top

Send this to a friend