కేరీర్ కంటే దేశమే ముఖ్యమన్న ఆటగాడిని మీరు చూశారా..?

mahender-singh-dhoni-apnewsonline

మహేంద్ర సింగ్ ధోని.. భారత క్రికెట్ తలరాతను మార్చిన మహా గొప్ప క్రికెటర్.. సచిన్, ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని ప్రపంచకప్ ను కేవలం తన సారథ్యంతో యువకులలో స్ఫూర్తి నింపి సాధించిన ఘనుడు.. అందుకే కపిల్ దేవ్ తర్వాత ప్రపంచకప్ అందించిన గొప్ప నాయకుడిగా ధోనికి పేరుంది. 2007లో తొలిసారి కెప్టెన్ అయ్యాక భారత్ కు టీట్వంటీ ప్రపంచకప్ అందించిన దోనీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.. వరుస విజయాలు సాధించారు. తాను ఆటగాడిగా గెలిపిస్తూ పరుగులు సాధిస్తూ ఆటగాళ్లను ప్రోత్సహించారు. ఆడని వారు ఎంత సీనియర్లు అయినా పక్కన పెట్టడంలో ధోని వెనుకాడేవారు కారు..
ధోని కఠిన నిర్ణయాలు ఈరోజు భారత్ ను ప్రపంచ విజేతగా, నంబర్ 1 స్థానంలో నిలిపాయనడంలో అతిశయోక్తి కాదు. మధ్యలో ఆటగాళ్లుగా విఫలమైన వీరేంద్ర సెహ్వాగ్, లక్ష్మన్, గౌతం గంభీర్, తన ప్రాణ స్నేహితుడు అయిన యువరాజ్ ను కూడా పక్కన పెట్టాడంటే దేశం కోసం.. క్రికెట్ కోసం ఎంత కఠినంగా ఉంటాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆడలేకపోతే పక్కకు తప్పుకోండి అని బహిరంగంగా అన్న క్రికెటర్ ఒక్క ధోని మాత్రమే..
అప్పటివరకు మూసధోరణితో ఆడినా ఆడకున్నా ఏళ్ల తరబడి జట్టులో ఉన్న ఆటగాళ్లకు ధోని సింహస్వప్నంలా మారాడు. తాను అమలు చేసిందే ఇప్పుడు తన దాకా వచ్చినా ధోని వెనక్కి తగ్గలేదు.. కొద్దిరోజులుగా ధోని ఫాం కోల్పోయాడు. టెస్టులో విఫలమైతే రిటైర్ మెంట్ ప్రకటించాడు. టెస్ట్ సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ విశేషంగా రాణించి కెప్టెన్ గా నిరూపించుకుంటున్నాడు. అదే సమయంలో వన్డే , టీట్వంటీ కెప్టెన్ గా ఉన్న దోని బ్యాటింగ్ లో విఫలమవుతున్నారు.. అందుకే తన స్వార్థం కోసం కాకుండా.. దేశం కోసం దోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీకి వన్డే, టీట్వంటీ బాధ్యతలు అప్పజెప్పేందుకు ఏకంగా ప్రస్తుత కెప్టెన్ పదవికి రాజీనామా చేశారు. వన్టే, టీట్వంటీ పదవులకు రాజీనామా చేసి తాను దేశం కోసమే ఆడుతానని.. ఆడని వారు టీంలో వద్దు అని గొప్ప స్ఫూర్తినిచ్చారు. ఆ విషయంలో తాను మినహాయింపు కాదని ప్రస్తుత రాజీనామాతో నిరూపితమైంది..

To Top

Send this to a friend