కేటీఆర్ సీఎం అయినా..

‘కేటీఆర్ ను కేసీఆర్ సీఎంని చేసినా శిరసావహిస్తా.. కేసీఆర్ నిర్ణయమే నా నిర్ణయం.. కేసీఆర్ ఏది చెబితే అది చేస్తాను. ఆయన లేనిదే నేను లేను.. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేసే కార్యకర్తను’ అని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మంత్రి హరీష్ రావు తో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో హరీష్ తన మనోభావాలను ఆవిష్కరించారు.

కేటీఆర్ కు సీఎం బాధ్యతలు అప్పజెప్పినా కేసీఆర్ మాటకు కట్టుబడి టీఆర్ఎస్ కోసమే పనిచేస్తానని.. కేసీఆర్ గీసిన గీతను తాను ఎక్కడ దాటనని హరీష్ చెప్పారు. ఇక రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించడం లో కీరోల్ పోషించింది హరీష్ రావేనన్న మాటలకు పరోక్షంగా అవును అన్నట్టు హరీష్ సమాధానమిచ్చారు.

కొద్దికాలంగా కేటీఆర్ కు ప్రాధాన్యం ఇస్తూ హరీష్ రావు కు ప్రాధాన్యం తగ్గించారన్న ప్రశ్నకు అవన్నీ రూమర్స్ అని హరీష్ సమాధానమిచ్చారు. ప్రాధాన్యం అనేది తగ్గిస్తే తగ్గేది కాదని.. పెంచితే పెరిగేది కాదని సమాధానమిచ్చారు. పార్టీ నాయకుడు ఇచ్చిన ఎన్నో బాధ్యతలను, ఎన్నికలను తాను గెలిపించానని.. ప్రాధాన్యానుసారం తనను వాడుకుంటారని హరీష్ చెప్పారు. హరీష్ ఎక్కడ కాలుపెడితే అక్కడ విజయం అన్న కేసీఆర్ డైలాగ్ తనకు స్పూర్తి అని కొనియాడారు.

To Top

Send this to a friend