‘కబాలి’తో పాటు ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్’

‘స్నేహమా… ప్రేమా… ఆకర్షణా..?’ అన్న ట్యాగ్‌లైన్‌తో బి.ఆర్‌.యస్‌.ఐ.మూవీస్‌ పతాకంపై పోల్కంపల్లి  నరేందర్‌ నిర్మిస్తున్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్’. గోపీనాథ్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘కబాలి’తోపాటు ఈ నె 23న ఆంధ్ర మరియు తెలంగాణాల్లో  విడుదలవుతోంది. విష్ణుప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో థర్టీ ఇయర్స్‌ పృధ్వీ, నల్ల వేణు, సుమన్‌శెట్టి, సూర్య, చిత్రం శ్రీను, జూనియర్‌ రేలంగి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ‘థియేటర్లు లభ్యం కాని పరిస్థితుల్లో ఇప్పటికి రెండుమూడు పర్యాయాలు వాయిదా పడి ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్‌’ చిత్రాన్ని ఎట్టకేలకు ‘కబాలి’ విడుదలైన మరుసటి రోజు, అనగా జూలై 23న రిలీజ్‌ చేస్తున్నామని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకనిర్మాతలు గోపీనాథ్‌, నరేందర్‌లు అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్‌, విజయ్‌వర్మ మాట్లాడుతూ.. ‘థియేటర్ల గుత్తాధిపత్యం చిన్న సినిమాలకు శాపంగా మారిందని, ఈ పరిస్థితిలో తక్షణం మార్పు రావాల్సి  ఉందని’ అన్నారు. ‘అప్పుడే ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ వ్‌’ వంటి చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించగలవని’ వారు అభిప్రాయబడ్డారు. ‘ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్‌’ సినిమా చూసినవారెవరైనా తమకు నచ్చలేదని సహేతుకంగా వివరిస్తే.. లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు ప్రకటించారు.

To Top

Send this to a friend