ఒక్క పాట చూసి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సుకుమార్

picture

తొలి చిత్రం విడుదల కాకముందే ఓ కొత్త దర్శకుడు రెండో సినిమాకు సైన్‌ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ దర్శకుల జాబితా ప్రిపేర్‌ చేస్తే` చాలా చిన్నగా కూడా ఉంటుంది. అందుకే.. ‘శివరాజ్‌ కనుమూరి’ అనే కుర్రాడి పేరు పరిశ్రమ వర్గాల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
శివరాజ్‌ కనుమూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. రూపొందుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టీజర్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసిన ప్రముఖ దర్శకులు సుకుమార్‌.. “ఓ రంగుల చిలకా” అనే ఆ సాంగ్ చూసి చిత్ర దర్శకులు శివరాజ్‌ కనుమూరితో తన బ్యానర్ “సుకుమార్ రైటింగ్స్”లో ఓ సినిమా అనౌన్స్‌ చేయడమే ఇందుకు కారణం.
“సుకుమార్‌ రైటింగ్స్‌” పతాకంపై శివరాజ్‌ కనుమూరి దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
శ్రీనివాస్‌రెడ్డి- పూర్ణ జంటగా శివరాజ్‌ ఫిలింస్‌ పతాకంపై.. స్వీయ నిర్మాణంలో శివరాజ్‌ కనుమూరి రూపొందిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ నవంబర్‌లో విడుదల కానుంది. ‘సమైక్యంగా నవ్వుకుందాం’ అనే ట్యాగ్‌లైన్‌తో.. ‘దేశవాళి ఎంటర్‌టైన్‌మెంట్‌’ అనే నినాదంతో సందడి చేస్తున్న ఈ చిత్రం నవంబర్ ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముఖ్యంగా.. “ఓ రంగుల చిలకా” అనే పాటకు సంగీత ప్రియుల నుంచి విశేషమైన స్పందన లభిస్తుండడం పట్ల సంగీత దర్శకులు రవిచంద్ర-కార్తీక్ రోడ్రెజ్, లిరిక్ రైటర్ రామాంజనేయులు సంతోషం వ్యక్తం చేశారు!

To Top

Send this to a friend