ఎన్టీఆర్ వారసులకే టీడీపీలో చోటు లేదు: హరికృష్ణ

తెలుగుదేశం ఎవ్వరిది..? దాని హక్కుదారులు ఎవ్వరు..? అంటే ఖచ్చితంగా అందరూ ఎన్టీఆర్ పేరే చెబుతారు.. సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటివరకు అప్రతిహతంగా కొనసాగిన కాంగ్రెస్ జైత్రయాత్రకు బ్రేక్ చేసి తెలుగు రాష్ట్రంలో టీడీపీ జెండాను ఎన్టీఆర్ ఎగురవేశారు. అంతటి మాహాత్ముడు ఆ తర్వాత రాజకీయ కారణాలతో పదవీ చిత్యుడు అయ్యాడు. 1996లో పార్టీని హైజాక్ చేసిన చంద్రబాబు.. ఎన్టీఆర్ ను కూలదోసి సీఎం అయ్యారు. ఆ తర్వాత పార్టీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఎదగనీయలేదు. వచ్చిన వారికి ఎదో ఓ పదవి ఇచ్చి వారి నోళ్లను మూయించారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని సినిమాల్లో కొనసాగిస్తున్న హీరో బాలక్రిష్ణ తో సంబంధం కలుపుకొని వియ్యంకుడిని చేసుకొని బాలయ్యను రాజకీయంగా ఎదగనీయకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఇక హరికృష్ణ లాంటి వాళ్లు బహిరంగంగా అప్పుడప్పుడు ఆవేదన చెందినా ఆయనకు గతంలో రాజ్యసభ టికెట్ ఇచ్చి ఆయన్ను బాబు మేనేజ్ చేశాడు..

గడిచిన 2009 ఎన్నికల్లో చంద్రబాబుకు పోటీగా జూనియర్ ను నిలపాలని.. టీడీపీ పార్టీలో కీలక పాత్ర పోషించాలని హరికృష్ణ యోచించారు.కానీ చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను తెరపైకి తీసుకొచ్చి ఎన్టీఆర్ కు చెక్ పెట్టారు. అప్పుడు తమ పార్టీ టీడీపీలో బాబు తమకే చోటు ఇవ్వడం లేదని హరికృష్ణ బహిరంగ విమర్శలు చేశారు. ఆ తర్వాత పరిణామాలతో మిన్నకుండిపోయారు. కానీ ఆ ఆవేదన ఆయనలో ఇప్పటికీ ఉంది..

కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని నరసింహాపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన సందర్భంలో హరికృష్ణ ఆవేదనతో మాట్లాడారు. ‘‘నిజాలు మాట్లాడుతా.. కాబట్టే.. తాను ఈ స్థితిలో ఉన్నా.. ఉన్నదున్నట్టు చెప్పడం.. వల్ల ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను.. అయినా వెనకడుగు వేయకపోవడంతో ప్రస్తుతం రాజకీయాల్లో దూరంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు’’ అని అన్నారు.. ఎన్టీఆర్ వారసులకే టీడీపీలో చోటు లేకుండా పోయిందని వాపోయారు.

కాగా సీసీరోడ్డును గతంలో రాజ్యసభ ఎంపీగా ఉండగా హరికృష్ణనే మంజూరు చేయించారు. అది ఇప్పటికీ పూర్తికావడంతో గ్రామస్థులు ఆయన్నే ప్రారంభోత్సవానికి పిలిచారు. దీంతో నరసింహాపురం వచ్చిన హరికృష్ణ ఇలా తన ఆవేదనను వెళ్లగక్కారు..

To Top

Send this to a friend