ఎన్టీఆర్ తో సినిమా.. 25 కోట్లు లాస్.. చిరుతో సినిమా 6 కోట్ల ఫ్రాఫిట్

ashwini-dutt-apnewsonline

అశ్వినీదత్ .. తెలుగు సినిమా పరిశ్రమలో పేరొందిన నిర్మాత.. 32 ఏళ్ల కిందట మొదలైన సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తీశాడు.. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో మొదలుకొని నేటి తరం హీరోలతో కూడా తీశాడు. మహేశ్, జూ.ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లను తెరంగేట్రం చేసిన నిర్మాత అశ్వినీదతే.. 7 లక్షలు తండ్రి ఇస్తే వాటిని పట్టుకొని వచ్చి చైన్నైలో సినిమా నిర్మాతగా ప్రస్థానం మొదలు పెట్టిన అశ్వీనీ దత్ ఎన్నో గొప్ప చిత్రాలను తెలుగు తెర కు అందించారు. చిరంజీవి-రాఘవేంద్రరావు లతో ఆయన తీసిన జగదేకవీరుడు మూవీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోయింది.. ఇక ఆ తర్వాత చిరుతో తీసిన ఇంద్ర మూవీ అశ్వీనీదత్ కు దాదాపు 6కోట్ల లాభాలు తెచ్చిపెట్టిందట.. ఇదే విషయాన్ని ఇటీవల ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్వీనీదత్ చెప్పుకొచ్చారు.

చిన్న సినిమాలే తనను కాపాడాయని.. పెద్దసినిమాలు ప్లాప్ అయితే నిండా మునిగానని అశ్వీనీదత్ చెప్పుకొచ్చారు. రామకృష్ణ సిద్దాంతి మాట ప్రకారం తీసిన సినిమాలు హిట్ అయ్యాయని.. ఆయన మాట వినకుండా తీసినవి ప్లాప్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. కాగా అశ్వినీదత్ కేరియర్ లో తీసిన భారీ చిత్రాల్లో ఒకటి శక్తి. ఎన్టీఆర్ హీరోగా సినిమా రూపొందింది. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అదిపెద్ద డిజాస్టర్.. ఈ సినిమాకు దాదాపు 25 కోట్లు ఖర్చుపెట్టిన అశ్వినీదత్ కు రూపాయి కూడా తిరిగిరాలేదట.. ఆ సినిమా తర్వాత చాలా సంవత్సరాలు సినిమా కూడా తీసే సాహసం చేయలేదు ఆయన.. ఇలా ఎన్టీఆర్ తో పాటు అశ్వినీదత్ కు కూడా చేదు అనుభవాల్ని మిగిల్చింది శక్తి సినిమా..

To Top

Send this to a friend