కాంగ్రెస్ ఖతం.. బీజేపీకి పీఠం

మోడీ ప్రభంజనం యూపీలోనే కాదు.. ఉత్తరాఖండ్ లోనూ కొనసాగింది. అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో కాంగ్రెస్ కు చావుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్ లో బీజేపీ మధ్యాహ్యానికే మొత్తం 70 సీట్లలో 52 స్థానాల్లో ముందంజలో ఉండి అధికారం దిశగా దూసుకుపోతోంది. అధికార కాంగ్రెస్ కేవలం 14 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఉత్తరాఖండ్ లో అభివృద్ధి మందగించడమే కాంగ్రెస్ ఓటమికి కారణమైంది. ఉత్తరాఖండ్ వరదల బీభత్సం తర్వాత అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన స్థాయిలో మౌళిక వసతులు కల్పించలేదు. కేంద్రం, ఇతరులు చేసిన సాయంలో కూడా సొంతానికి వాడుకున్నారని.. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ ఓటమికి దారితీశాయి..

ఇక బీజేపీ గెలుపుకు ప్రధానంగా దోహదపడింది అభివృద్ధి మంత్రమే.. మోడీ ప్రధానంగా మౌళిక సదుపాయాలు, అభివృద్ధి ఏజెండాను ప్రచారం చేశారు. దీంతో బీజేపీకి ప్రజల ఆదరణ లభించి ఏకపక్షంగా విజయం సాధ్యమైంది.

To Top

Send this to a friend