ఈ కొడుకు.. నీకు అవసరమేగా..?

up_mulayam-singh-yadav-akhilesh

అంతర్గత విభేధాలు.. కుటుంబ తగాదాలు.. అసమ్మతి జ్వాలతో యూపీలోని అధికార సమాజ్ వాదీ పార్టీ భష్ట్రపట్టిపోతోంది.. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు అధికార పార్టీలో ఇంతటి అసమ్మతి రాజుకోవడంతో ఆ పార్టీ గెలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు అక్కడి పార్టీ నాయకులను కలవరపరుస్తోంది..

ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన కొడుకు యూపీ సీఎంగా ఉన్నారు. ములాయం తన తమ్ముడు శివపాల్.. మరో నేత అమర్ సింగ్, రెండో భార్య మాట విని అఖిలేష్ ను సస్పెండ్ చేయడం వివాదానికి కారణమైంది. అఖిలేష్ ఏకంగా తండ్రిపైనే తిరుగుబాటు చేసి ఆయనను నామమాత్రుడిని చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు.. రెండు వర్గాలుగా విడిపోయిన సమాజ్ వాదీ పార్టీ పంచాయతీ ఇప్పుడు ఎన్నికల కమీషన్ కు చేరింది. సమాజ్ వాదీ సైకిల్ గుర్తు మాదంటే మాది అని తండ్రి కొడుకులు ఫిర్యాదు చేయడంతో వివాదమైంది. ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండగా గుర్తు తేలకపోవడంతో సమాజ్ వాదీ పార్టీకి ఇది పెద్ద శరాఘాతంగా మారింది.

ఈ వివాదాలతో యూపీలో అధికారం కోల్పోవడం ఖాయమని సన్నిహితులు హెచ్చరించడంతో ములాయం మారిపోయారు. విలేకరులతో మాట్లాడుతూ తిరుగుబాటు చేసినా అఖిలేష్ నా కొడుకే కదా అని వ్యాఖ్యానించారు. అఖిలేష్ సీఎంగా ఉంటారని.. తమ్ముడు యూపీ చీఫ్ గా ఉంటారని.. తాను అఖిలేష్ విషయాల్లో కలుగజేసుకోనని ములాలయం స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతానికి ఎన్నికల వేళ పార్టీని ఐక్యంగా తీసుకెళ్లానని ములాయం చెప్పకనే చెప్పారు. వివాదాలతో పార్టీ గెలవదనే సత్యం బోధపడడంతోనే ములాయం కొడుకు అఖిలేష్ పై కరుణ చూపి నా కొడుకే కదా తిరుగుబాటు చేసింది అని పేర్కొనడం గమనార్హం..

To Top

Send this to a friend