ఇప్పుడర్థమైందీ.. యువరాజ్ ను జట్టులోకి తీసుకోనిది ఎవరో..

yuvaraj-dhoni-kohli

2011 ప్రపంచకప్ వన్డే టోర్నీ.. భారత్ గెలిచింది.. భారత్ ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నిగా నిలిచింది ఎవరో తెలుసా..యువరాజ్ సింగ్.. అప్పుడు బ్యాటుతో, బంతితో చెలరేగిన యూవీ ప్రతి మ్యాచ్ లోను చెలరేగి ఆడి భారత్ కు ప్రపంచకప్ ను అందించారు. అయితే ఆ తరువాత ఫిట్ నెస్ సమస్యలతో జట్టుకు దూరమయ్యాడు. తిరిగి ఫాంలోకి వచ్చి బాగా ఆడినా అప్పటి కెప్టెన్ ధోని అతడిని తీసుకోలేదు. ఇది వాస్తవం కూడా.. యూవీని జట్టులోకి తీసుకోకుండా ధోని అడ్డుపడుతున్నాడని స్వయంగా యూవీ తండ్రి యోగరాజ్ సింగ్ బహిరంగంగా విమర్శించాడు కూడా.. అయినా విమర్శలకు వెరువని.. జట్టు కోసమే ఆలోచించే ధోని అంతటి దిగ్గజ ఆటగాడిని కూడా పక్కకుపెట్టాడు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది..

ధోనీ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. టీమిండియా పగ్గాలు విరాట్ కోహ్లీ చేతికి చిక్కాయి.. కెప్టెన్ మారడంతో అభిరుచులు మారాయి. నిర్ణయాధికారం మారింది. అందుకే ధోని పటించిన జూనియర్ల మంత్రాన్ని విరాట్ పక్కనపెట్టాడు. సీనియర్లు అయిన యువరాజ్, నెహ్రాలకు వన్టే, టీట్వంటీలో స్థానం కల్పించాడు. దాదాపు 3 ఏళ్లు జట్టుకు దూరమైన యువరాజ్ ను జట్టులోకి తీసుకొని ఓ రకంగా ధోనికి షాక్ ఇచ్చినట్టే.. యూవీ కూడా గత రంజీన్ సీజన్ డబుల్ సెంచరీతో పాటు 84 సగటుతో పరుగులు సాధించి సత్తాచాటాడు. ఇలా ధోనీ నిష్ర్కమణతో జట్టు స్వరూపం మారింది. యువరాజుకు కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు నిరూపించుకుంటే యూవీ ఉంటాడు. లేదంటే కొత్తవారు జట్టులోకి వస్తారు..

To Top

Send this to a friend