ఇంకో రెండేళ్లు ఉందిగా.. అందుకే మోడీ..


ప్రజలు కూడా చాలా తెలివి మీరి పోయారు. మనకు అభివృద్ది జరగాలంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే గెలిపించాలనే సత్యాన్ని వంటపట్టించుకున్నారు. అందుకే అధికారపార్టీలనే గెలిపిస్తూ అభివృద్ధి చేసుకుంటున్నారు. మొన్న మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికలు కానీ.. ఖాళీ అయిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు గానీ .. ఆంధ్రావాళ్లు సగం ఉన్న హైదరాబాద్ జీహెచ్ఎంసీలో గానీ అధికారపార్టీలకే విజయం దక్కింది.. ఎందుకంటే ఆ పార్టీలతోనే పనులు జరుగుతాయని అటు జనాలకు, నాయకులకు తెలుసు కాబట్టి విజయం వారిని వరిస్తోంది..

నిన్న ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవానడుస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో ఊదరగొడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కమల వికాసం ఉంటుందని.. అయితే మెజార్టీకి 10-20 స్థానాలు తక్కువ వచ్చేట్టు ఉన్నాయని అన్ని టాప్ జాతీయ చానాళ్లు స్పష్టం చేశాయి. కానీ అతిపెద్ద పార్టీగా యూపీలో అవతరించేది బీజేపీనని పేర్కొన్నాయి. ఇక రెండో స్థానంలో అఖిలేష్ కు దాదాపు 150 సీట్లు వస్తాయని పేర్కొటున్నారు..

కాగా పంజాబ్ లో ఆశ్చర్యకరంగా అధికార అకాలీ-బీజేపీకి చావుదెబ్బ ఖాయం అని సర్వేలు తెలిపాయి. అక్కడ కాంగ్రెస్-ఆప్ నువ్వానేనా అన్నట్టు పోరాడుతున్నాయని చెప్పాయి. మొత్తంగా కొంచెం కేజ్రీవాల్ ఆప్ పార్టీకే మొగ్గు కనిపిస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక చిన్నరాష్ట్రాలు మణిపూర్ గోవాల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో 5 రాష్ట్రాల్లో నాలుగింట కమలవికాసం గ్యారెంటీగా కనిపిస్తోంది..

బీజేపీకి దక్కకుండా అఖిలేష్ పాచిక..
బీజేపీకి యూపీ పీఠం దక్కకుండా అధికార పార్టీ నేత సీఎం అఖిలేష్ పాచిక వేస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 202 సీట్లు ఏపార్టీ యూపీలో సాధించే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తెలుపుతుండడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయవతితో పొత్తుపెట్టుకోవాలని అఖిలేష్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం బెంగాల్ సీఎం మమతతో కలిసి మాయను ఒప్పించేందుకు రాయబారం నెరుపుతున్నట్టు తెలిసింది. ఎలాగైనా బీజేపీకి అధికారం రాకుండా చేసేందుకు మాయతో కలిసి అఖిలేష్ మరోసారి సీఎం పీఠం అధిష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. బీజేపీకి అధికారం చేపట్టడానికి మరో 20 స్థానాలు అవసరమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంతంగా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో పొత్తుల ద్వారానే అధికారం చేపట్టాలి. దీంతో అఖిలేష్ మాయను సంప్రదిస్తున్నారు. బీజేపీ ఇంకా ఈ విషయంపై ఆలోచించడం లేదు. దీంతో యూపీ ఎవరి పరం అవుతుందానన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.

To Top

Send this to a friend