ఆ పిల్లల కష్టం చూసి కేటీఆర్ కదిలిపోయారు..

మన చిన్నప్పుడు సంగతి.. అమ్మా నాన్న.. ఉదయం పది గంటల వరకు అన్ని పనులు చేసుకొని వంట వండి పిల్లలకు తినిపించి వాళ్లు పనికెళ్లి పిల్లల్ని స్కూలుకు పంపించేవారు. గవర్నమెంట్ బడులు గ్రామాల్లో ఉదయం 10 గంటలకు మొదలయ్యేవి.. సాయంత్రం 4 గంటలకు ముగిసేవి.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు ఇప్పుడు ఎందరో మేధావులుగా.. విజ్ఞానవేత్తలుగా ఎదిగారు.. ఆహ్లాదకర వాతావరణంలో.. ఎలాంటి ఒత్తిడి లేని పరిస్థితుల్లో మనం చదివాం.. ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన అబ్దుల్ కలాం దేశానికి రాష్ట్రపతిగా.. గొప్ప శాస్త్రవేత్తగా ఎదగలేదా..? కానీ అదంతా గతం.. ఇప్పుడు పోటీ పెరిగింది.. సమాజం మారింది..

పాపం చిన్నారులు చదువుల వేటలో బలైపోతున్నారు.. కనీసం నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. ఉదయం 8 గంటలకే వారి స్కూళ్లు మొదలైపోతున్నాయి.కంటికి కునుకు కరువై.. కనీసం బ్రేక్ ఫాస్ట్ తినే తీరిక కూడా ఉండడం లేదు. మార్కులు, ర్యాంకులు, బట్టీలు, హాస్టళ్లలో బాల్యం బంధీ అయి పోతోంది.. మన చిన్నప్పుడులా ఆటలు, పాటలు, ఆనందం, జీవనమాధుర్యం పొందక బాల్యం మసకబారిపోతోంది..

ఇలాంటి దురదృష్టకర సంఘటనే ఒకటి కేటీఆర్ దృష్టికి వచ్చింది.. ఒక పాప.. కనీసం బ్రేక్ ఫాస్ట్ చేసే టైం కూడా లేకుండా ఆదరబాదరగా స్కూలుకు వచ్చి జేబులో చపాతి ముక్క పెట్టుకొని ఉండడం ఓ వ్యక్తి కంటపడింది. దాన్ని ఫొటో తీసి కేటీఆర్ ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు. ఇంతగా బాల్యం బంధీ అయిన వ్యవస్థను మార్చాలని.. పిల్లల స్కూలు టైంను ఉదయం 10.00 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుదించాలని కేటీఆర్ ను కోరారు. దీనికి కదిలిపోయిన కేటీఆర్ దాన్ని రీ ట్వీట్ చేసి ఇలా రాసుకొచ్చారు.. ‘‘ మీ వాదనతో పూర్తికా అంగీకరిస్తున్నా.. ఫొటో గుండెను కదిలించేలా ఉంది. ఇలంటి ప్రెషర్ కుక్కర్ చదువులు మన సమాజంలో ఉండకూదడు.. ’ అని కేటీఆర్ వాపోయాడు. తెలంగాణ సర్కారులో కీలక స్థానంలో ఉన్న కేటీఆర్ మన ఇలాంటి చదువులు చూశాక స్పందించి ప్రక్షాళన చేస్తాడా లేదా అన్నది వేచిచూడాల్సిందే..

కేటీఆర్ ట్వీట్ కింద చూడచ్చు..

To Top

Send this to a friend