ఆస్ట్రేలియాతో ఫైట్: టీమిండియా

త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు ఆటగాళ్లు సెలక్టర్లు ఎంపిక చేశారు. 15మందితో కూడిన జట్టులో కరుణ్ నాయర్ ను తిరిగి జట్టులోకి ఎంపిక చేశారు. కుల్ దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్ లకు కొత్తగా చోటు కల్పించారు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన చివరి టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించి అదరగొట్టిన కరుణ్ నాయర్ పై సెలక్టర్లు నమ్మకం ఉంచి టెస్టు జట్టులోకి ఎంపిక చేయడం విశేషం. బంగ్లాదేశ్ తో టెస్టుకు నాయర్ ను పక్కనపెట్టిన సెలక్టర్లు ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియాతో పోటీకి ఎంపిక చేయడం గమనార్హం. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్ లకు చోటు దక్కినా వారికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియాతో కూడా వీరు జట్టులో ఉన్నా అవకాశం రావడం కష్టమే..
ఈనెల 23న ఆస్ట్రేలియాతో పుణెలో జరిగే తొలిటెస్టులో భారత జట్టు పెద్దగా మార్పులేని జట్టుతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. జట్టులో మురళీ విజయ్, రాహుల్, పూజారా వికెట్ కీపర్ గా సాహా ఎంపికయ్యారు. పూర్తి జట్టును ఒక్కసారి పరిశీలిస్తే..
ఆస్ట్రేలియాతో తొలిరెండు టెస్టులకు భారత జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, రాహుల్, పూజరా, రహానే, కరుణ్ నాయర్, సాహా(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, ఇషాంత్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, కుల్దీప్, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్య

To Top

Send this to a friend