ఆకట్టుకుంటున్న డోర


ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడియోకు చక్కటి స్పందన వస్తోంది.పాటలన్నీ అర్థవంతమైన సాహిత్యంతో ట్రెండీగా వున్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి. కారులో దెయ్యం అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవ్యమైన కథతో, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఆద్యంత.. ఉత్కంఠను పంచే విధంగా చిత్రంలోని సన్నివేశాలు వుంటాయి. ఇక నయనతార అంటేనే చక్కటి అభినయానికి పెట్టింది పేరు. ఆమెకు అగ్రహీరోలతో సమానమైన ఇమేజ్ వుంది. దక్షిణాది కథానాయికల్లో నయనతార సూపర్‌స్టార్. అత్యుత్తమ నిర్మాణ విలువలతో డోరా సినిమాను తెరకెక్కించాం. మయూరి తరహాలో ఈ సినిమాతో నయనతార మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

To Top

Send this to a friend