అసహన చక్రవర్తి..


మొక్కులు వ్యక్తిగతమైనా.. తెలంగాణ ప్రజలవైనా.. మొత్తానికి కేసీఆర్ తన మొక్కులను దేవుళ్లకు చెల్లించేశారు. మొన్న తిరుపతి వెంకన్నకు.. నిన్న కురవి వీరభద్రస్వామికి మీసాలు ఇచ్చేశారు. బంగారు తాపడాలు ఆర్పించేశారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శించడం సహజం.. ఎందుకంటే వాటిపనే అది.. కేసీఆర్ మొక్కులు తీర్చేందుకు ప్రభుత్వ సొమ్మును పప్పు బెల్లాలుగా మార్చేశాడని విమర్శించాయి. వాటిపనే అది కావడంతో ప్రతిపక్షాలను తప్పుపట్టలేం.. కానీ అధికారంలో ఉన్నవాళ్లకు చాలా ఓపిక అవసరం.. అదీ కేసీఆర్ లో లోపించింది. అందుకే తన మొక్కులను విమర్శించిన వారిని సన్నాసులు, ఎవధలు.. దొంగలు.. బానిసలు అంటూ నోరుపారేసుకున్నారు..
అసలైన సీఎంగా ఓపికకు పర్యాయపదంగా దివంగత రాజశేఖర్ రెడ్డి ని చెప్పవచ్చు.. ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చారు. అధికారంలో వచ్చాక టీడీపీ, దాని తోకపత్రికలు వైఎస్ పై ఫుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురించాయి. అయినా ఆయన ఆ రెండు పత్రికలు అని పేరు కూడా ప్రస్తావించకుండా కేసీఆర్ లా ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులు.. విమర్శలు చేసేవారు కాదు. వాటికి పోటీగా ఎలాంటి పరుష పదాలు వాడేవారు కాదు.. కానీ కేసీఆర్ తనపై ప్రభుత్వంపై చేసిన విమర్శలను తట్టుకోలేరు. మొదట్లో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై నిషేధం విధించారు. ఆ తర్వాత ప్రతిపక్షాలను తుత్తినియలు చేయడం.. పరుషంగా విమర్శించడం చేస్తున్నారు. ఆ ఓపిక ఇసుమంతైనా లేక కేసీఆర్ అభాసుపాలవుతున్నారు.
పాలకులకు ఓపిక ఉండాలి. ప్రతిపక్షాలకు దూకుడు ఉండాలి. వింతగా తెలంగాణలో దీనికి రివర్స్ గా జరుగుతోంది. కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ వారు సైలెంట్ గా ఉంటున్నారు. అప్పుడో ఇప్పుడో కాంగ్రెస్ వారు తిట్టిన మాటలకు కేసీఆర్ ఇలా పరుషంగా విమర్శిస్తున్నారు. సన్నాసులు, దద్దమ్మలు అంటూ ఆడిపోసుకుంటున్నారు. కేసీఆర్ లో ఆ ఫస్ట్రేషన్ తగ్గాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు, నాయకులు కోరుకుంటున్నారు.

To Top

Send this to a friend