అసలు ఎవరీ పళని స్వామి.?

తమిళనాడు రాజకీయాల్లోనే అనూహ్యం ఇదీ.. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు వేడెక్కాయి. చిన్నమ్మ శశికళ సీఎం అవుదామనుకుంది. అందుకే అప్పటివరకు ఉన్న పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించి గద్దెనెక్కాలన చూసింది. కానీ అక్రమాస్తుల కేసులో తీర్పు రావడం శశికళ జైలు కెళ్లడం జరిగిపోయాయి. ఇంతలో అనూహ్యంగా శశికళ జైలుకు పోతూ తన స్థానంలో సీనియర్ మంత్రి అయిన పళని స్వామిని సీఎం అభ్యర్థిగా బరిలో నిలిపి వెళ్లిపోయింది. గవర్నర్ ఈరోజు పళనిస్వామిని తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించడంతో ఇన్ని రోజుల ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడు సీఎం పదవి కనీసం ఎవ్వరూ ఊహించన వ్యక్తికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఫళనిస్వామి.. జయలలిత క్యాబినెట్ లో పన్నీర్ తర్వాత నెంబర్ 2 సీనియర్ మంత్రి. పన్నీర్ శశికళపై తిరుగుబావుట ఎగురవేసి వేరుకుంపటి పెట్టడంతో ఆయన తర్వాత సీనియర్ అయిన పళనిస్వామి మాత్రం శశికళకు సపోర్టు చేశాడు. ఇదే ఆయన నెత్తిన పాలు పోసింది. ఫళని స్వామి 1989,1991,2011, 2016 ఎన్నికల్లో గెలిచి నాలుగు సార్లు మంత్రి పదవి చేపట్టారు. జయ క్యాబినెట్ లో రహదారులు, భవనాల శాఖ చూసిన పళని జయకు నమ్మిన బంటుగా ఉండేవారు. పన్నీర్ తర్వాత పార్టీలో సీఎం అయ్యే చాన్స్ ఆయనే ఉండేది. తమిళనాడులోని సాలెం జిల్లాలోని ఎడప్పాడి పట్టణంలో పళని జన్మించారు. విద్యార్థినాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి అన్నాడీఎంకే లో అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం పన్నీర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. అందుకే పన్నీర్ తిరుగుబావుట చేసి పోవడంతో ఆయన తర్వాత సీనియర్ ఫళని శశికళ వెంట నడవడం ఆయనకు కలిసివచ్చింది. శశికళ జైలు పాలు కావడంతో శశి తనకు అండగా నిలిచిన ఫళని స్వామినే సీఎంగా నిర్ణయించింది. ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలవడంతో అనూహ్యంగా ఫళని స్వామి తమిళనాడు కొత్త సీఎం అవుతున్నారు.

To Top

Send this to a friend