అల్లు అరవింద్, చిరు వ్యూహాలకు దెబ్బైపోయిన ప్రత్యర్థులు.

chiranjeevi-allu-aravind

బామ్మర్ధి బతుకు కోరుతాడు అంటాడు.. అది నిజం.. చిరంజీవికి తన 150 వ సినిమా విడుదలకు, ఆడియో ఫంక్షన్లకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే.. ఆ ఒక్కడు చిరు కోసం అండగా నిలిచాడు.. బావకు తిరుగులేని విజయాన్నందించాడు.. అల్లు అరవింద్ .. ఇప్పుడు చిరంజీవి 150 వ సినిమా ఘనవిజయం.. ఆ సినిమా ప్రమోషన్.. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అక్యూపై చేసుకోవడంలో ఘనవిజయం సాధించారు. అందుకే చిరు సినిమాకు థియేటర్లు పోటెత్తగా.. ప్రత్యర్థి సినిమాలకు థియేటర్లే దొరకని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది.

కొద్దిరోజులుగా అల్లు అరవింద్ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా.. శాసనకర్తగా మారారు. నైజాం, సీడెడ్, కోస్తా, ఏపీల్లో మేజర్ థియేటర్లను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. తెలంగాణలో దిల్ రాజు, ప్రభాకర్ రెడ్డి వంటి డిస్టిబ్యూటర్లతో మంచి సంబంధాలు కొనసాగించి థియేటర్లను తనకు దక్కేలా చేసుకున్నారు. ఏపీలో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించారు అందుకే చిరంజీవి 150 వ సినిమాకు మంచి థియేటర్లు చాలా ఎక్కువ సంఖ్యలో దొరికాయి. అదే పోటీగా విడుదలవుతున్న మూవీకి ఎక్కడా థియేటర్లు దొరకని పరిస్థితి ఎదురైంది. సినిమా జయాపజయాలాను పక్కనపెడితే చిరుకు కొండంత అండలా అల్లు అరవింద్ వన్ మ్యాన్ ఆర్మీలా అన్ని చక్కబెట్టుకొచ్చి చిరును ఉన్నతస్థానంలో నిలిపాడు..

ఆదినుంచి చిరంజీవి ఎదుగుదలలో అల్లు రామలింగయ్య, ఆయన కుమారుడు అల్లు అరవింద్ లు కీలకపాత్ర పోషించారు. చిరంజీవిని అల్లుడిగా చేసుకున్న మొదలు ఇప్పటివరకు చిరు స్వయంకృషికి అల్లు అరవింద్ చాణక్యం, బిజినెస్ ఐడియాలు తోడై తెలుగు హీరోల్లోనే చిరును అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత చిరు రీఎంట్రీని కూడా గ్రాండ్ గా నిర్వహించి అల్లు అరవింద్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. చిరు సినిమాకు ఏపీలో ఎన్ని అడ్డుంకులు ఎదురైనా వాటన్నింటిని తుత్తునియలు చేసి ప్రత్యర్థులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు.. అవే రికార్డు కలెక్షన్ల దిశగా సాగుతున్నాయి..

To Top

Send this to a friend